లాక్‌డౌన్ వల్ల దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడూ పనులతో బిజీగా గడిపే ప్రజల జీవనశైలి మారింది. మరోపక్క పేద, మధ్య తరహా కుటుంబాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కాగా ఈ లాక్‌డౌన్ సమయంలో మహిళలపై వేధింపులు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయని, నాలుగు గోడల మధ్య ఏదైనా జరగొచ్చని కథానాయిక వరలక్ష్మి శరత్ కుమార్ అన్నారు. గృహ హింసకు గురౌతున్న మహిళలకు సాయం చేయమంటూ ఆమె హెల్ప్‌లైన్ నెంబరును ట్విటర్‌లో షేర్ చేశారు. ‘మన చుట్టూ ఉన్న మహిళలకు సాయం చేద్దాం.. ఈ లాక్‌డౌన్‌లో గృహ హింస నుంచి వారిని కాపాడుదాం.. వారు ఇంట్లో చిక్కుకుని ఉండొచ్చు. దయచేసి మీకు తెలిసిన మహిళలకు 1800 102 7282 నెంబరును షేర్ చేయండి. వేధించడానికి వయసు, ఆస్తి, స్థాయితో సంబంధం లేదు.. ఎక్కడైనా ఇది జరగొచ్చు’ అని ఆమె పేర్కొన్నారు. ప్రముఖ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి. ఆమె విభిన్నమైన పాత్రలతో అలరిస్తున్నారు. ఇటీవల తెలుగులో నేరుగా ‘తెనాలి రామకృష్ణ’ సినిమాలో నటించారు. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ‘క్రాక్’లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా ‘నాంది’లోనూ కనిపించనున్నారు. వరలక్ష్మి చేతిలో పలు తమిళ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.
గృహహింస బాధిత మహిళలను కాపాడండి
Related tags :