Movies

గుర్రాలను తోముతున్నాను

Actress Jacqueline Fernandez Washing Horses

‘‘ప్రతిరోజూ రెండుసార్లు గుర్రపుస్వారీ చేస్తున్నా. రోజు రోజుకీ అందులో ప్రావీణ్యం సాధిస్తున్నా. గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్‌! అలాగే, నేను గుర్రాలకు స్నానం చేయిస్తున్నా. గుర్రపుశాలను శుభ్రం చేస్తున్నా’’ అని జాక్వలైన్‌ ఫెర్నాండేజ్‌ అన్నారు. ప్రస్తుతం ముంబయ్‌లో ఉన్నారీ శ్రీలంకన్‌ సుందరి. లాక్‌డౌన్‌ ప్రకటినప్పుడు పన్వేల్‌ ఫామ్‌ హౌస్‌లో కొందరు స్నేహితులతో కలసి ఉన్నారు. ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో ఎక్కడికీ వెళ్లడానికి లేదు కాబట్టి అక్కడే ఉండిపోయారు. ఆ ఫామ్‌ హౌస్‌ సల్మాన్‌ ఖాన్‌ది.లాక్‌డౌన్‌లో అలా లాక్‌ అయిపోయిన జాక్వలైన్‌ ఫెర్నాండేజ్‌ మాట్లాడుతూ ‘‘నా అదృష్టమిది. ఇక్కడి నేచర్‌ చాలా బావుంది. నేను ఎక్కువగా వర్కవుట్స్‌ చేస్తున్నా. గార్డెన్‌లో కూరగాయలతో సలాడ్స్‌ చేస్తున్నా. గుర్రపు స్వారీ, గుర్రాలకు స్నానాలు వంటివి చేస్తున్నా’’ అన్నారు. ‘లాక్‌డౌన్‌లో ఏం తెలుసుకున్నారు?’ అని జాక్వలైన్‌ని ప్రశ్నించగా… ‘‘మనుషులుగా మనం మన గురించే ఆలోచిస్తాం. రేపు మనం వెళ్లిపోయినా… ఎప్పటికీ భూమి ఇలాగే ఉంటుంది’’ అన్నారు