Fashion

చర్మం పాడైపోతోందా?

Corona Hand Wash Drying Out Hands

కనీసం 20 సెకన్ల పాటు సబ్బుతో లేదా శానిటైజర్‌తో చేతులను శుభ్రంగా కడుక్కోండి. ప్రపంచ ఆరోగ్యసంస్థ మొదలుకుని, వైద్యులు, నిపుణులు చెబుతున్న మాట ఇది. అయితే పదే పదే చేతులు కడగడం వల్ల ఇతర సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు చర్మ వ్యాధి నిపుణులు. ఆ సమస్యల నుంచి బయటపడడం కోసం వారు చేస్తున్న సూచనలు ఇవి…
పదే పదే చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం పొడిబారడం, చర్మం కింద ఉండే పొర దెబ్బతినడం జరుగుతుంది. సబ్బుతో కడిగినపుడు క్రిములతో పాటు చర్మంపై ఉండే సహజసిద్ధమైన ఆయిల్స్‌ కూడా పోతాయి. అందుకే మాయిశ్చరైజింగ్‌ గుణాలు ఉన్న సబ్బులను ఎంచుకోవాలి.
చేతులు శుభ్రం చేసుకున్న ప్రతీసారి మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి. విటమిన్‌-ఇ, బాదం, కొబ్బరి వంటి పదార్థాలున్న మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి. వాటర్‌ బేస్డ్‌ మాయిశ్చరైజర్స్‌ను ఎంచుకోవద్దు.
రాత్రిపూట కాటన్‌ గ్లౌజులు ధరించాలి. అయితే కాస్త వదులుగా ఉండేవి ఎటంచుకోవాలి.
ఒక చిన్న బౌల్‌లో నాలుగు టీస్పూన్ల బాదం నూనె, ఒక టేబుల్‌స్పూన్‌ రోజ్‌వాటర్‌, అర టీస్పూన్‌ టింక్చర్‌ వేసి కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని రాత్రివేళ చేతులకు రాసుకొని గ్లౌజులు ధరించి పడుకోవాలి. ఉదయాన్నే చేతులను నీటితో శుభ్రం చేసుకోవాలి.
సెనగపిండి, పసుపు, పాలు కలిపి పేస్టులా చేసి చేతులకు పట్టించాలి. 20 నిమిషాల తరువాత చేతులు కడిగేసుకోవాలి.
బాదం నూనెలో తేనె కలిపి చేతులపై నెమ్మదిగా మర్ధన చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చేతులు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు.