ScienceAndTech

ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ఉండాలి

Indian Govt Mandates Aarogya Sethu App

దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులందరి వద్దా కరోనా వైరస్ ట్రాకింగ్ యాప్ ఆరోగ్యసేతు ఉండాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఎక్కడైనా సరే కార్యాలయాలకు హాజరయ్యే ఉద్యోగుల ఫోన్లలో మే 4 నుంచి తప్పకుండా ఉండాల్సిందేనని పేర్కొంది. తమ ఉద్యోగుల ఫోన్లలో ఆ యాప్ లేకుంటే కనుక దానికి ఆయా కంపెనీల యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అలాగే, కంటైన్‌మెంట్ జోన్లలో ఉన్న వారు కూడా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే, ఇంటి దగ్గరి నుంచి పనిచేస్తున్న వారు మాత్రం యాప్‌ను ఉపయోగించాల్సిన అవసరం లేదని పేర్కొంది. కాగా, వచ్చే మరికొన్ని వారాల్లో ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్లు 30 కోట్లకు చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.