Kids

జంతువులను అంతర్జాలంలో చూడవచ్చు

Kids Can Now View Zoo And Animals On Internet

లాక్‌ డౌన్‌ నేపథ్యంలో పలు కార్పొరేట్‌ విద్యా సంస్థలు ఆన్‌ లైన్‌ సేవలు ప్రారంభించాయి. ఇప్పుడు మ్యూజియాలు, ఖగోళ ప్రదర్శన కేంద్రాలు, జంతుప్రదర్శన శాలలు, సైన్సు కేంద్రాలు… కూడా లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. కోల్‌కతాలోని అత్యంత పురాతనమైన అలీపూర్‌ జూ అధికారులు ఆన్‌లైన్‌లో జంతువులను వీక్షించే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. వర్చువల్‌ టూరిస్టుల సంఖ్య పెంచుకోవడానికి ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందించారు. తమకు నచ్చిన జంతువును ఈ యాప్‌ ద్వారా చూసే అవకాశాన్ని అందిస్తున్నారు. వాటి ఫొటోలు, వీడియోలు చూసే ఏర్పాటు చేశారు. చెన్నై జూ రెండేండ్ల క్రితమే లైవ్‌ స్ట్రీమింగ్‌ సేవలు ప్రారంభించింది. సంస్థ వెబ్‌ పేజీ ద్వారా రోజుకు 60 వేల నుంచి 80 వేల మంది సందర్శకులు అక్కడి జీవరాశిని వీక్షిస్తున్నారు. 14 రకాల జంతువులను లైవ్‌లో చూసే వీలు కల్పిస్తున్నారు. ఇందుకోసం ఆవరణలో 180 కెమెరాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీ నేషనల్‌ మ్యూజియం కూడా లైవ్‌ స్ట్రీమింగ్‌ సేవలు అందించే పనిలో నిమగ్నమయింది. సైన్సు సెంటర్లు కూడా త్వరలో లైవ్‌ స్ట్రీమింగ్‌ సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నాయి.