Movies

రిపోర్టర్ కాబోయి యాక్టర్

Rashmika Speaks Journalism-Telugu Movie News

సినీ రంగంలో ఎలాంటి బ్యాక్‌‌గ్రౌండ్‌ లేకుండా అవకాశాలు దక్కించుకోవడం, వరుస విజయాలు సాధించడం అంత తేలికైన విషయం కాదు. కానీ కన్నడ అందం రష్మిక విషయంలో మాత్రం ఈ రెండూ చాలా సునాయాసంగా జరిగిపోయాయి. తోటి హీరోయిన్లు కుళ్ళుకునే విధంగా వరుస విజయాలు సాధిస్తూ టాలీవుడ్ టాప్ హీరోయిన్ దిశగా దూసుకెళుతుంది. అయితే ఆమె చదువుకు, ఎంచుకున్న రంగానికి అస్సలు సంబంధం లేదు. ఆ వివరాలేంటో ఆమె మాటల్లోనే..‘‘ఇది నూటికి నూరుపాళ్ళు నిజం. చదివింది జర్నలిజమే అయినా, ఆ రంగంకన్నా సినీ రంగమే నన్ను ఎక్కువగా ఆకర్షించింది. ఊహ తెలిసినప్పటినుంచీ నటనమీద ఆసక్తి పెరిగింది. నేరుగా నటిని కావాలంటే సాధ్యం కాదు కనుక మోడలింగ్‌లోకి అడుగుపెట్టాను. మోడల్‌గా పలు ఉత్పత్తులకు పనిచేసిన తరువాతే నాకు అవకాశాలు రావడం మొదలయ్యాయి. నటించడానికి వచ్చిన ప్రారంభంలో నా ముఖాన్ని ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటారో లేదో తెలియదు. ప్రయత్నం చేద్దాం అని సినీ జీవితాన్ని ప్రారంభించాను. అలా తొలి చిత్రమే విజయాన్ని అందించింది. ఆ తరువాత వరుసగా అవకాశాలు ముంగిట వచ్చి వాలుతున్నాయి. అయితే ఇలా వేగంగా ఎదిగి, వెంటనే పడిపోకూడదు. అందుకే ప్రతి చిత్రాన్నీ చాలా జాగ్రతగా ఎంపిక చేసుకుంటున్నాను. వాటి నుంచి చాలా నేర్చుకుంటున్నాను..’’ అని రష్మిక చెప్పుకొచ్చింది.