కరోనా రక్కసి కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలు, కూలీలు, కార్మికులకు తానా ఆధ్వర్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో సరుకులు, కూరగాయలు, బియ్యం తదితర సామాగ్రిని వితరణగా అందజేశారు.
గుడివాడ గ్రామీణ మండలం దొండపాడులో యార్లగడ్డ వెంకటరమణ నేతృత్వంలో శ్రీకాకుళం నుండి వలస వచ్చిన 50కూలీలకు సరుకులు అందజేశారు.
కొత్తగూడెంలో ఆటోడ్రైవర్లు, తాపీ కార్మికులు, ఇంటి పనివారు తదితరులు తూనుగుంట్ల శిరీష, మిట్టపల్లి సురేశ్‌లు నిత్యావసర సామాగ్రిని విరాళంగా అందజేశారు.
తానా గొడుగు కింద ఎంతో మంది పేదవారు ఇలా లాబ్ధి పొందడం ఆనందంగా ఉందని తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ తెలిపారు. వీరికి ఆయన అభినందనలు అందజేశారు.