గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో ఉన్న క్షౌరశాలలను తెరచుకోవచ్చని కేంద్ర హోం శాఖ తెలిపింది. ఈ నెల 4 నుంచి మొదలయ్యే మూడో దశ లాక్‌డౌన్‌లో ఇచ్చిన కొన్ని సడలింపులపై శనివారం స్పష్టతనిచ్చింది. నిత్యావసరాలు కానివాటిని కూడా ఆ రెండు జోన్లలో ఈ-కామర్స్ సంస్థలు విక్రయించుకోవచ్చని తెలిపింది. రెడ్‌జోన్లలోనైతే ఈ-కామర్స్ సంస్థలు కేవలం నిత్యావసర వస్తువుల్ని విక్రయించేందుకు అనుమతి ఉంది. రెడ్‌జోన్లలోని ఇళ్లలో పనిచేసేవారి విషయంలో స్థానిక నివాసుల సంక్షేమ సంఘాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కంటెయిన్‌మెంట్ ప్రాంతాలు మినహా అన్ని జోన్లలో మద్యం విక్రయాలను కొన్ని షరతులతో అనుమతిస్తారు. ఇవన్నీ సోమవారం నుంచి అమల్లోకి వస్తాయి.
మీ జుట్టు కటింగ్‌కు పర్మిషన్ వచ్చింది
Related tags :