Health

బీపీ బిళ్లలు ఓకే

BP tablets will not affect coronavirus in any way

కోట్ల మంది అధిక రక్తపోటు బాధితులకు శుభవార్త అందించాయి రెండు తాజా పరిశోధనలు. హైబీపీ నివారణకు వినియోగించే ఏసీఈ నిరోధకాలు (ఇన్హిబిటర్లు), ఇతర ఔషధాల కారణంగా కొవిడ్‌ బారినపడే అవకాశాలు పెరగవని తెలిపాయి. అలానే కరోనా బారినపడిన రక్తపోటు బాధితుల్లో.. ఈ ఔషధాల వినియోగంతో వ్యాధి ముదిరే అవకాశాలూ లేవని స్పష్టంచేశాయి. అమెరికా, చైనాల్లో జరిగిన వేర్వేరు పరిశోధనల వివరాలు ‘ద న్యూ ఇంగ్లాండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌, జామా కార్డియాలజీ’ల్లో ప్రచురితమయ్యాయి. బీపీ బాధితులు… నిర్దేశిత ఔషధాలను తప్పక వినియోగించాలని, లేకుంటే హైబీపీతో గుండె, కిడ్నీ సమస్యలు తలెత్తుతాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.