Food

డాల్గోనా కాఫీ గురించి విన్నారా? తాగారా?

Have you ever tasted Dalgona coffee

కాఫీ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి! అందుకే అందులో ఏ కొత్త వెరైటీ వచ్చినా కాఫీ ప్రియులు అస్సలు మిస్సవ్వరు. ఇలా కొత్తగా వచ్చి నెట్టింట్లో చక్కర్లు కొడుతోందే డాల్గోనా కాఫీ. సౌత్‌కొరియాలో దీన్ని ఎప్పటి నుంచో తయారుచేస్తున్నారట. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆ దేశ నటుడు జంగ్‌టూవూ ఈ కాఫీని ఎలా తయారుచేయాలో తెలియజేస్తూ ఓ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశాడు. అది చూసిన వారు తామూ దాన్ని తయారుచేస్తున్నారు. ముందుగా ఇన్‌స్టంట్‌ కాఫీ పొడి, పంచదార, వేడి నీళ్లు కలిపి బాగా మెత్తగా అయ్యేంత వరకూ గిలకొడుతున్నారు. ఇలా తయారుచేసిన మిశ్రమాన్ని వేడి లేదా చల్లని పాల మీద వేసి గార్నిష్‌ చేసి అందిస్తే అదే డాల్గోనా కాఫీ అన్నమాట. విభిన్నమైన రుచితో అందరినీ అలరిస్తోంది ఇది. ఇంకెందుకు ఆలస్యం… మీరూ ట్రై చేయండి మరి!