రష్యాలో ఇవాళ ఒక్కరోజే 10 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. నమోదైన కేసుల్లో సగానికిపైగా దేశ రాజధాని మాస్కోలో నమోదవడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఇవాళ 10,633 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. అందులో సగానికిపైగా మాస్కోలో నమోదయ్యాయి. కరోనా విజృంభణ మొదలైన తర్వాత ఇలా ఒక్కరోజులోనే 10 వేలకుపైగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని అక్కడి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటివరకు రష్యాలో కేసుల సంఖ్య 1,34,000కు చేరగా.. 1420 మంది ప్రాణాలు కోల్పోయారు.
రష్యాలో కరోనా విస్ఫోటనం
Related tags :