ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పొదిలి, విశాఖ, సికింద్రాబాద్‌లలో కరోనా బాధితులకు నిత్యావసర సరుకులను అందజేసింది.
ప్రకాశం జిల్లా పొదిలి మండలం మూగవింతల గ్రామంలో 400 కుటుంబాలకు స్థానిక నాట్స్ ప్రతినిధి బండారు బాబు నేతృత్వంలో సరుకులు అందజేశారు.
సికింద్రాబాద్‌లోని మంచికలలు ఆశ్రమానికి నిత్యావసరాలు అందజేసింది.
విశాఖలో గ్లో సంస్థతో కలిసి షీలానగర్‌లోని పెట్రోల్ బంక్ వద్ద ఆటో, లారీ డ్రైవర్లకు ఉచితంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో గ్లో సంస్థ ప్రతినిధి వెంకన్న చౌదరి, నాట్స్ ప్రతినిధి సూర్యదేవర రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.
కష్టకాలంలో తమను ఆదుకున్న నాట్స్ సంస్థకు బాధితులు తమ ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాసబాబు, ఛైర్మన్ అప్పసాని శ్రీధర్, కోశాధికారి మదన్ పాములపాటి, ఇతర కార్యవర్గ సభ్యులు నాట్స్ ఆధ్వర్యంలో మరింతగా కరోనా సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తున్నారు.