NRI-NRT

తాళూరి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

Talluri Trust Helps Poor People And Brahmins With Groceries In Bhadrachalam

తాళ్లూరి ట్రస్ట్ అధ్యక్షుడు తాళ్లూరి పంచాక్షరయ్య, తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, ప్రవాస భారతీయులు డాక్టర్.తాళ్లూరి రాజా శ్రీకృష్ణల ఆధ్వర్యంలో శనివారం నాడు భద్రాచలంలో 2000 నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ చేశారు. భద్రాచలంలో 130 మంది బ్రాహ్మణులకు కిట్లు, 500 రూపాయల నగదు అందజేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చిన తాళ్ళూరి ట్రస్ట్, తానా తదితర సంస్థలకు బ్రాహ్మణులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి ట్రస్ట్ అధ్యక్షుడు పంచాక్షరయ్య, వల్లూరిపల్లి వంశీకృష్ణ, బిక్కసాని శ్రీనివాసరావు, అడుసుమిల్లి జగదీష్, చావా లక్ష్మీనారాయణ, పల్లంటి దేశప్ప,చక్రవర్తి,అల్లం నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.