DailyDose

ఏపీలో ఆర్టీసీ సర్వీసులు-వాణిజ్యం

Telugu Business News Roundup Today-APSRTC To Begin In Green Zones

* ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆర్టీసీ స‌ర్వీసుల‌ను తిరిగి ప్రారంభించేందుకు ప్ర‌భుత్వం స‌మాయ‌త్త‌మైంది. లాక్‌డౌన్ కార‌ణంగా ఇన్నాళ్లు నిలిచిపోయిన నిలిచిపోయిన ఆర్టీసీ పునఃప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ది. కేంద్ర ప్ర‌భుత్వం విధించిన మార్గదర్శకాల మేర‌కు కేవలం గ్రీన్ జోన్లలోనే బస్సులు నడిపేలా చ‌ర్య‌లు చేపట్టింది. అయితే ప‌రిమిత సంఖ్య‌లో ప్ర‌యాణికుల‌ను అనుమ‌తిస్తూ, సోష‌ల్ డిస్టెన్స్ పాటిస్తూ బ‌స్సులు న‌డుప‌నున్న‌ట్లు ఏపీ ప్ర‌భుత్వం తెలిపింది.

* విజయవాడ నుంచి వెళ్లే గన్నవరం రోడ్లో.. నిడమానూరు వద్ద విమాన రెస్టారెంట్‌ సిద్ధమైంది. దిల్లీలో ఉన్న తరహాలో ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలని విజయవాడకు చెందిన ఔత్సాహికులు ఆలోచించారు. పాత విమానం ఒకటి కొనుగోలుచేసి రెస్టారెంట్‌గా తీర్చిదిద్దారు. లాక్‌డౌన్‌ పూర్తయితే.. దీన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

* లాక్‌డౌన్‌ ప్రభావంతో కొన్ని ప్రైవేటు బ్యాంకులు ముందే అప్రమత్తమవుతున్నాయి. క్రెడిట్‌ కార్డుల్లో కోతలు విధించేందుకు రంగం సిద్ధం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే కొంతమంది కార్డుల లిమిట్‌ను ఒక్కసారిగా సగానికి తగ్గించేశాయి. లాక్‌డౌన్‌ ఎన్ని రోజులు ఉంటుందో స్పష్టత లేదు. ముందస్తు చర్యల్లో భాగంగా క్రెడిట్‌ కార్డుల అప్పులు తగ్గించుకునేందుకు కొత్త పద్ధతిని అనుసరిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది బిల్లులు చెల్లించడం లేదని బ్యాంకులు ఆందోళనలో ఉన్నాయి

* గత ఆరేళ్లలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీఓబీ) నిరర్థక ఆస్తులు ఆరు రెట్లు, ఇండియన్‌ బ్యాంక్‌ నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏలు) నాలుగు రెట్లు పెరిగినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. దీంతో మార్చి, 2014 నాటికి రూ.11,876 కోట్లుగా బీఓబీ ఎన్‌పీఏలు డిసెంబరు, 2019 వరకు రూ.73,140 కోట్లకు చేరాయి. ఇక ఎన్‌పీఏ ఖాతాలు 2,08,035 నుంచి 6,17,306కు పెరిగాయి.