Movies

నా బట్టలు విప్పమన్నాడు

Aayushmann Khurrana On His Casting Couch Experience

ఖురానా మాట్లాడుతూ.. సినిమా ఛాన్స్‌ల కోసం ఆడిషన్స్‌ ఇచ్చే సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. ‘సినిమా ఛాన్స్‌ ఉందని ఓ దర్శకుడు ఆడిషన్స్‌కి పిలిచాడు. ఇక అక్కడికి వెళ్లాక ఆయన నువ్వు నీ ప్రైవేటు భాగాలను చూపిస్తే నీకు సినిమాలో ప్రధాన పాత్ర‌ ఇస్తానని చెప్పాడు. ఇక క్షణం ఆలోచించకుండ వెంటనే ఆయన ఆఫర్‌ను సున్నీతంగా తిరస్కరించాను’ అని చెప్పుకొచ్చాడు. అయితే ‘‘అప్పటి నుంచి నేను ఎన్నో సార్లు తిరస్కరణలకు గురయ్యాను. ఇక ప్రారంభంలో సోలో టెస్టు తీసుకుంటామని చెప్పి ఒకేసారి 50 మందిని లోపలికి పిలిచేవారు. అయితే దీనిని నేను వ్యతిరేకిస్తే తిరిగి వెళ్లిపోమ్మని చెప్పేవారు. అలా నేను ఎన్నోసార్లు ఆడిషన్స్‌కు వెళ్లి తిరిగి వచ్చేవాడిని’’ అంటూ తనకు ఎదురైన చేదు అనుభాన్ని గుర్తు చేసుకున్నాడు.