అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు బాగా తగ్గడంతో, దేశీయంగా విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలు గణనీయంగా దిగివచ్చాయి. తాజా సవరణల్లో భాగంగా, ఒక్కసారిగా 23 శాతం ధర తగ్గించడంతో, పెట్రోల్-డీజిల్ ధరలో మూడోవంతుకే ఏటీఎఫ్ లభిస్తోంది. అయితే పన్నుల భారం తగ్గించకపోవడంతో, 50వ రోజున (ఆదివారం) కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదు. ప్రభుత్వరంగ చమురు సంస్థల దిల్లీ ధరల ప్రకారం.. ఏటీఎఫ్ కిలోలీటర్ (వెయ్యి లీటర్ల) ధరను రూ.6812.62 మేర (23.2 శాతం) తగ్గించడంతో, ప్రస్తుతం రూ.22,544.75కు లభిస్తోంది. అంటే లీటర్ ఏటీఎఫ్ రూ.22.54 మాత్రమే. అదే లీటర్ పెట్రోల్ వచ్చేసరికి రూ.69.59 అవుతోంది. బస్సులు, లారీలకు వినియోగించే డీజిల్ ధరా లీటర్ రూ.62.29 కావడం గమనార్హం. ఎటువంటి రాయితీ లేని కిరోసిన్ ధర కూడా 13.3 శాతం తగ్గడంతో, లీటరు రూ.39.67కే లభిస్తోంది.
విమాన ఇంధన ధరలు తగ్గాయి
Related tags :