WorldWonders

పొద్దుపొద్దున్నే 10కిమీ లైను

Indians form a line for miles in front of bars and wine shops for liquor

కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ విధించడంతో.. అత్యవసర, నిత్యావసరాలు తప్ప.. దేశవ్యాప్తంగా అన్నీ మూతపడ్డాయి.. ముఖ్యంగా లిక్కర్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు మూతపడడంతో మందుబాబులు అల్లాడిపోయారు. అయితే, ఈ నెల 4వ తేదీతో లాక్‌డౌన్‌ 3.0 అమల్లోకి వచ్చింది… రెడ్‌జోన్లలోని కొన్ని చోట్ల మినహా.. మిగతా ప్రాంతాల్లో లిక్కర్‌ అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.. దీనికి కొన్ని రాష్ట్రాలు అంగీకరించకపోగా.. మరికొన్ని రాష్ట్రాలు లిక్కర్ సేల్స్ ప్రారంభించాయి. కానీ, అధికారులకు ఊహించని షాక్ తగిలింది.. ఇంతకాలం మందులేక అల్లాడిపోయిన మందుబాబులు.. నిన్న ఉదయం నుంచే వైన్స్‌ల ఎదుట క్యూలు కట్టారు.. దీంతో.. ఏ మద్యం షాపు దగ్గర చూసినా కిలోమీటర్ల కొద్ది క్యూ లైన్లు దర్శనమిచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే.. సామాజికదూరం మాటేలేదు.. మాస్కుల ముచ్చటలేదు.. గుంపులు గుంపులుగా వచ్చి మద్యం బాటిళ్ల కోసం పోటీపడ్డారు. వీరిని కట్టడి చేయడం పోలీసులకు కూడా కత్తిమీద సాములా మారిపోయింది. ఢిల్లీలో అయితే.. మందు బాబులను అదుపుచేయలేక.. వైన్స్‌లు తెరిచిన కాసేపటికే ఏకంగా మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక, ఏపీలోనూ భారీ సంఖ్యలో మందుబాబులు రోడ్డెక్కారు.. ఏ వైన్స్ దగ్గర చూసినా ఎప్పుడూ లేనంత రద్దీ.. ఒకే రోజులే దాదాపు రూ.60 కోట్ల వరకు లిక్కర్ అమ్మకాలు జరిగాయని అంచనా ఉన్నా.. ఇలాంటి పరిస్థితులు ఉంటే.. కరోనా వ్యాప్తి చెందకుండా ఏమవుతుంది? ఇలాగైతే ఎలా కట్టడి చేస్తారనే విమర్శలు వచ్చాయి. దీంతో.. లిక్కర్ అమ్మకాలపై అధికారులు సమాలోచనలో పడ్డారట.

ఇక, విజయవాడలో నిన్న ఉదయం నుంచే మందుబాబులు రోడెక్కినా.. కేసుల తీవ్రత ఎక్కవగా ఉండడంతో.. ఏ షాపులు తెరవాలన్నదానిపై ఎటూతేల్చలేకపోయారు అధికారులు.. దీంతో.. అక్కడ నిన్న లిక్కర్ షాపులు అసలు తెరుచుకోలేదు. ఇవాళ్టి నుంచి అమ్మకాలు జరుగుతాయని.. కొన్ని ఎంపిక చేసిన వైన్స్‌ల్లోనే మద్యం విక్రయాలు సాగుతాయని అధికారులు తెలిపారు. అయితే, నిన్న చోటు చేసుకున్న పరిణామాలతో.. అసలు ఇవాళ మద్యం అమ్మకాలు కొనసాగించాలా? వద్దా? అనే సమాలోచనలో పడ్డారట అధికారులు.. నిన్న క్యూలైన్లలో ఉన్నవారికి కొన్ని ప్రాంతాల్లో టోకెన్లు కూడా జారీ చేశారు.. ఇవాళ అమ్మకాలు ప్రారంభం కాగానే వాళ్లకే మొదట లిక్కర్ అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ, పరిస్థితులు చూస్తుంటే.. ఇవాళ అసలు మద్యం అమ్మకాలు జరుగుతాయా? లేదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో.. ఇప్పుడు మందుబాబుల్లో కొత్త టెన్షన్ మొదలైంది.. ఎంతో కాలం వేచిచూసిన తర్వాత.. నిన్న మద్యం షాపులు తెరుచుకోవడంతో.. ఊపిరిపీల్చుకున్న మందుబాబులు.. ఇవాళ పరిస్థితి ఏంటి? అని టెన్షన్‌ పడిపోతున్నారు.