జపాన్‌లో లాక్‌డౌన్‌ను ఈ నెల మొత్తం (మే 31) వరకు కొనసాగించనున్నట్లు ఆ దేశ ప్రధానమంత్రి షింజో అబే అన్నారు. కరోనా కేసుల వేగాన్ని తగ్గించేందుకు ప్రస్తుతానికి ఇంతకు మించిన మరో మార్గం లేదని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన జాతినుద్దేశించి మాట్టాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనాను కట్టడీ చేసే విషయమై జపనీయులకు షింజో అబే స్పష్టమైన సందేశం ఇచ్చారు. ‘‘కరోనా మహమ్మారిని అంతం చేయాల్సిన నెల మేనే అని, తదుపరి దశకు సిద్ధమయ్యే నెల కూడా ఇదే అవుతుందని ఆయన అన్నారు. ఇప్పటి వరకు జపాన్‌లో 15,253 కేసులు నమోదు అయ్యాయి. కరోనా వల్ల 556 మంది జపనీయులు మృతి చెందారు. ఇక 4,496 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
జపాన్‌లో మే31 వరకు సెలవులు
Related tags :