ఫోన్ ఎక్కువ వాడితే స్కిన్ డ్యామేజ్..
‘మొబైల్ ఫోన్ దూరంగా ఉంటే ఒత్తిడి పెరిగిపోయి, ఏమాత్రం హ్యాపీగా ఉండలేకపోతున్నాం’ అని యూనివర్శిటీ ఆఫ్ మిస్సోరీ చేసిన ఒక స్టడీలో తేలింది. ఆ హ్యాపీనెస్ సంగతేమో కానీ ఎక్కువసేపు ఫోన్ వాడితే స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది తెలుసా…
సూర్యుడి నుంచి వచ్చే యూవీ రేస్ కంటే కూడా ఫోన్, ట్యాబ్స్ నుంచి వచ్చే బ్లూ లైట్ రేస్ బలంగా చర్మం లోపలికి పోతాయి. దీన్ని హై ఎనర్జీ విజిబుల్ (హెచ్ఈవీ) లైట్ అంటారు.
ఈ లైటింగ్ చర్మానికి అవసరమైన కొలాజిన్, ఎలాస్టిన్లను డ్యామేజ్ చేస్తుంది. దాంతో చర్మం ముడతలు పడుతుంది. చర్మం మీద మచ్చలు కూడా పెరుగుతాయి.
చర్మాన్ని యూవీ రేస్ నుంచి కాపాడేది సన్ స్క్రీన్ లోషన్స్. కానీ.. బ్లూ లైట్ ఎఫెక్ట్ను సన్ స్క్రీన్ కూడా ఆపలేదు.
ఫోన్నే ఎక్కువసేపు చూస్తుండడం వల్ల మెడనొప్పితో పాటు స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది. నుదురు, మెడ, చెంపలతో పాటు ముఖమంతా ముడతలు వస్తాయి.
ఫోన్ మాట్లాడేటప్పుడు చెంపకు పెట్టుకుంటే.. ఫోన్ మీద ఉన్న వైరస్, బ్యాక్టీరియాలు ముఖం మీదకి చేరతాయి. కొన్ని రకాల బ్యాక్టీరియా వల్ల మొటిమలు వస్తాయి. అందుకని స్పీకర్ ఆన్ చేసి మాట్లాడటం లేదా ఇయర్ ఫోన్ వాడటం అలవాటు చేసుకోవాలి. అలాగే ఫోన్ తక్కువగా వాడితే ఎన్నో రకాలుగా మంచిది.