అమెరికావ్యాప్త కరోనా సహాయక చర్యల్లో భాగంగా టెన్నిస్సీ రాష్ట్ర నాష్‌విల్ నగర తానా విభాగం ఆధ్వర్యంలో స్థానిక పోలీసులకు, డేవిడ్సన్ కౌంటీ ఆసుపత్రి వైద్య ఉద్యోగులకు స్థానిక తానా విభాగం ఆహారాన్ని అందించింది. విపత్తు వేళ ప్రాణాలను పణంగా పెట్టి పౌరుల భద్రత కోసం పోరాడుతున్న వీరికోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నాష్‌విల్ తానా సమన్వ్యకర్త కిలారు రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కందుల ఉదయ్, భీమవరపు అనీల్, రాజ్ రంగా, మద్దిపట్ల ప్రవీణ్, వల్లేపల్లి తాండవ్ తదితరులు పాల్గొన్నారు. యువత చొరవ తీసుకుని ఇటువంటి సేవా కార్యక్రమాలు చురుగ్గా చేపట్టడం గర్వకారణమని తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ వీరిని అభినందించారు.
నాష్‌విల్ పోలీసులకు తానా తోడ్పాటు

Related tags :