* దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. ఆరంభం లాభాలనుంచి ఏమాత్రం పుంజుకోని కీలక సూచీలు చివరికి భారీ నష్టాలతో కీలక మద్దతు స్థాయిలకు దిగువన ముగిసాయి. 2002 పాయింట్లు పతనంతో సెన్సెక్స్ 31715వద్ద, నిఫ్టీ 566 పాయింట్లు కుప్పకూలి 9293 వద్ద స్థిరపడ్డాయి.తద్వారా సెన్సెక్స్ 32వేల దిగువకు చేరగా, నిఫ్టీ 9300 స్థాయిని నిలబెట్టుకోలేకపోయింది. అలా ఈ నెల డెరివేటివ్ సిరీస్ భారీ నష్టాలతో బోణీ చేసింది. దీంతో గత నాలుగు రోజుల లాభాలు మొత్తం ఆవిరైపోయాయి.
* దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు మరో వెసులుబాటును కల్పించింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తితో ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు భారీ ఊరట కల్పించనుంది. యోనో కృషి యాప్ ద్వారా వ్యవసాయదారులకు గోల్డ్ లోన్ సదుపాయాన్ని అందిస్తోంది. కరోనా వైరస్ సంక్షోభం, లాక్ డౌన్ సమయంలో అన్ని నిబంధనలను పాటిస్తూ కూడా నిరంతరాయంగా తమ కస్టమర్లకు సేవలందిస్తున్నామని పేర్కొంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇలాంటి రుణాలను 5 లక్షలకు పైగా చెల్లిచినట్టు తెలిపింది.
* బీరు 330ంల్ – పెరిగిన ధర 20రూ.
500/650ంల్ -30 రూ.
30000ంల్ – 2000రూ.
50000ంల్- 3000రూ.
రెడీ టూ డ్రింక్ 250/275ంల్. – 30రూ.పెరుగుదల
180ంల్ ధర 120రూ.కంటే తక్కువ ఉన్న వాటిపై పెంపు
60/90ంల్.- 10రూ.పెరుగుదల
180 ంల్ – 20రూ.పెరుగుదల
375ంల్ – 40రూ.పెరుగుదల
750ంల్ – 80రూ.పెరుగుదల
1000ంల్ -120రూ.పెరుగుదల
2000ంల్ – 240రూ.పెరుగుదల
180ంల్ ధర 120 నుంచి 180 రూ.మధ్యలో ఉన్న వాటిపై పెంపు
60/90ంల్.- 20రూ.పెరుగుదల
180 ంల్ – 40రూ.పెరుగుదల
375ంల్ – 80రూ.పెరుగుదల
750ంల్ – 160రూ.పెరుగుదల
1000ంల్ -240రూ.పెరుగుదల
2000ంల్ – 480రూ.పెరుగుదల
150రూ.కంటే ఎక్కువ ధర ఉన్న వాటిపై పెంపు
* అమ్మకాలు మొదలయ్యాయి.. తెలంగాణలో అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయినా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఉదయం 11 గంటల నుంచి ఈమద్యం అమ్మకాలు ప్రారంభం అయ్యాయి… అయితే, లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి మందు లేక అల్లాడిపోతున్న మందుబాబులు.. ఉదయాన్ని రోడ్లపైకి వచ్చేశారు.. వైన్స్‌ల దగ్గర భౌతిక దూరాన్ని పాటించేలా సూచిస్తూ గీసిన సర్కిళ్లలో నిలబడి.. మద్యం కోసం వేచిచూస్తున్నారు. ఓ వైపు ఏపీ సర్కార్.. మద్యం ధరలను 25 శాతం పెంచినా.. ఆ ఎఫెక్ట్ మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి.. ఏ వైన్ షాపు ముందు చూసినా భారీ క్యూలైన్లు దర్శనమిస్తున్నారు. అయితే, రెడ్‌జోన్లు, కంటైన్మెంట్ జోన్లలో మాత్రం అమ్మకాలకు అనుమతి లేకపోవడంతో.. మిగతా ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. మరోవైపు.. కొన్ని ప్రాంతాల్లో వైన్స్ షాపుల దగ్గరకు వచ్చిన మందుబాబులను పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు.. దీంతో.. ఏ షాపు తెరుస్తారు. ఏ షాపు ఓపెన్‌కు నోచుకోదు అనేదానిపై క్లారిటీ ఇవ్వనున్నారు అధికారులు. కాగా, ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయాలు కొనసాగనున్నాయి
* కరోనా వైరస్ మహమ్మారితో వ్యాపార రంగంలో మార్పులు గణనీయంగా చోటు చేసుకున్నాయి. ఐటీ పరిశ్రమలో దాదాపు 70-90% మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. సమావేశాలన్నీ వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా జరుగుతున్నాయి. భారత్‌లో సాంకేతికంగా ఇలాంటి మార్పులు రావాలంటే కనీసం 5-10 ఏళ్లు పడుతుందని అంతా భావించారు. ఇప్పుడది పటాపంచలై కేవలం వారాల వ్యవధిలోనే జరిగిపోయింది.
* దేశ్యాప్త లాక్‌డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో తమ కంపెనీ 60 శాతం ఉత్పత్తిని తగ్గించిందని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ వెల్లడించింది. ఏప్రిల్ 2019లో ఉత్పత్తి 13.90 లక్షల టన్నులు ఉండగా.. అది ఈసారి 5.63 లక్షల టన్నులకే పరిమితమైందని తెలిపింది. కంపెనీ ఉత్పత్తి సామర్థ్యంలో కేవలం 38 శాతాన్ని మాత్రమే వినియోగించుకున్నట్లు పేర్కొంది. తిరిగి ఉత్పత్తిని పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు కావాల్సిన అనుమతుల కోసం చర్యలు ప్రారంభమయ్యాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే సురక్షితమైన వాతావరణంలో కొంతమేర ఉత్పత్తిని పెంచినట్లు వెల్లడించారు. క్రమంగా దీన్ని పెంచుకుంటూ పోనున్నట్లు తెలిపారు.
* బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), ఇండియన్ బ్యాంక్‌ల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) ఆరేళ్లలో భారీగా పెరిగాయి. బీఓబీ ఎన్‌పీఏలు ఏకంగా ఆరింతలు పెరిగి రూ.73,140 కోట్లకు చేరగా, ఇండియన్ బ్యాంక్ ఎన్‌పీఏలు నాలుగింతలై రూ.32,561 కోట్లకు చేరినట్లు సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) ద్వారా తెలిసింది.
* 2014 మార్చి ఆఖరుకు బీఓబీ ఎన్‌పీఏలు రూ.11,786 కోట్లు ఉండగా, 2019 డిసెంబరు చివరకు రూ.73,140 కోట్లకు చేరాయి. ఎన్‌పీఏ ఖాతాల సంఖ్య కూడా 2,08,035 నుంచి 6,17,306కు చేరింది.
* ఇండియన్ బ్యాంక్ ఎన్‌పీఏలకొస్తే 2014 మార్చి ఆఖరుకు రూ.8,068.05 కోట్ల మేర ఉండగా, 2019 డిసెంబరు చివరకు రూ.32,561.26 కోట్లకు చేరాయి. ఎన్‌పీఏ ఖాతాలు 2,48,921 నుంచి 5,64,816కు చేరాయి.
* గిరాకీ లేకపోవడంతో దేశీయంగా వాణిజ్య వాహన (సీవీ) విభాగం పూర్తిగా దెబ్బతింది. వాహన తయారీ ఆపేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ప్రభుత్వం కనుక పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు, ఆర్థికంగా ప్రోత్సాహకర విధానం (స్క్రాపేజ్ పాలసీ) అమలు చేస్తే, మళ్లీ వాణిజ్య వాహనాల అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ విజ్ఞప్తి చేస్తున్నాయి. కొన్ని సంవత్సరాలు తిరిగిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు సమగ్ర విధానం తీసుకురావాలని, పాత వాహనాలకు విలువ, దాని స్థానంలో కొత్త వాహనం కొంటే, పన్ను అంశాల్లో ఆర్థిక ప్రోత్సాహకాలు కల్పించాలని వాహన సంస్థలు కోరుతున్నాయి. ఇందువల్ల కొత్త వాణిజ్య వాహనాల కొనుగోలుకు యజమానులు ముందుకొస్తారని, అప్పుడు గిరాకీ పుంజుకుంటుందని పేర్కొన్నాయి. గత ఏడాది కాలంగా వాణిజ్య విక్రయాల్లో క్షీణత నమోదవుతూ వస్తోంది. ‘బీఎస్-6 ప్రమాణాలకు మారే క్రమంలో గతంలో ఇబ్బందులు ఎదురైతే, ఇప్పుడు కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో పూర్తిగా దెబ్బతిన్నాం. పాత వాహనాలు రోడ్ల మీద నుంచి వెళ్లిపోతే మినహా పరిశ్రమ మళ్లీ బాగుపడేలా లేదు. పాత వాహనాలను తుక్కు కింద మారిస్తే, కాలుష్యం తగ్గడంతో పాటు కొత్త వాహనాలకు గిరాకీ పెంచినట్లు అవుతుంద’ని టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ వెల్లడించాయి.