Agriculture

2020లో ఒక ఎకరాకు రైతు పెట్టుబడి ఎంత?

The pathetic state of farmers in India

1. నారుమడి,మరియు
పొలం దున్నడం : ₹ 5500
2. చదును చేయడం వేయడం:
₹ 1500
3. గట్టు చెక్కడం పెట్టడం : ₹ 1000
4. వరి నాటు : ₹ 4000
5. వరి విత్తనాలు హైబ్రిడ్20 కిలోలు : ₹ 1800
6. కలుపు మందు, కలుపుతీయడం: ₹ 1800
7.DAP 2 బస్తాలు : ₹ 2500
8. జింక్ 10 కిలోలు : ₹ 600
9.గుళికలు: ₹ 1000
10.యూరియా2బస్తాలు : ₹ 700
11. పొటాష్1బస్తా : ₹ 950
12.మందుల పిచికారీ : ₹ 1000
13. వరి కోత మిషన్ : ₹ 2000
14. మిషన్ కు ట్రాక్టర్ : ₹ 1000
15. ధాన్యం ఆరబెట్టడం : ₹ 500
16. హమాలి ఛార్జ్ : ₹ 1000
రైతు పెట్టుబడి మొత్తము: ₹ 26,850
ధాన్యం దిగుబడి బస్తాలు = 70
1 బస్తాకి కిలోలు = 40
అంటే 70×40 = 28 క్వింటాళ్లు
క్వింటాలుకు…ధర ₹ 1810×28= 50,680=00
రైతు పెట్టుబడి= ₹ 26,850/-
రైతుకు మిగిలింది=₹ 23830/- రైతు 6నెలల కష్టార్జితం
రైతుకు 1నెల కష్టార్జితం=₹ 3971/-
అంటే రైతుకు ఒక్క రోజుకు పడే కూలి ₹ 132
ఆరుకాలం కష్టపడితే వచ్చే ఆదాయం ..??
ఒకవేళ ప్రకృతి కన్నెర్ర చేస్తే??
గాలి దుమారం,వడగండ్ల వాన లేదా అగ్గితెగులు,మెడవిరుపు, వగైరా లాంటి రోగాలు వస్తే ఏంటి రైతు పతిస్థితి???
రైతు ఆదాయం కనీసం ఇంకొక 50% నుంచి 75% పెరగడమే ఏకైక పరిష్కారం, దానికి ప్రభుత్వం మార్గాలు అనుసరించాలి, రైతు ఉత్పత్తులకు విలువ జోడిస్తే చాలా వరకు మేలు చేకూరుతుంది
క్రికెటర్లకు, సినిమా నటులకు, రాజకీయ నాయకుల పోస్టులకు మనం వందలు, వేలు, లక్షల్లో లైక్కు, షేర్లు, కామెంట్లు పెడతాము, ఎందుకంటే మనం వాళ్ళను అభిమానిస్తాము గాబట్టి. తప్పు లేదు కానీ కష్టాలు పడి, మనకు అన్నం పెట్టే రైతుపై అంతకన్నా అభిమానం చూపాలి, రైతు కష్టాన్ని గుర్తించాలి, అంతే కాక 6 నెలలు కష్టపడితే కానీ రైతు పండించే ధాన్యం గింజ మన కంచంలో అన్నంగా మనం తింటాము, కావున ఒక్క అన్నం మెతుకు కూడా వృధా చెయ్యొద్దు అని నా మనవి.