‘మిత్రమా! మన రాజుగారి గురించి ఒక సంగతి చెప్పాలి’ అంటూ ప్రత్యక్షమయ్యాడు గోపాలుడు.
‘ఆగాగు. మూడు వడపోతల
తర్వాత అదేమిటో చెబుదువు కానీ?’ అడ్డుచెప్పాడు భూపాలుడు.
‘అవేమిటి’ అన్నాడు గోపాలుడు.
‘మొదటి వడపోత… సత్యం.
నువ్వు చెబుతున్నది నిజమేనా’- భూపాలుడు.
‘ఏమో, ఎవరో చెబితే విన్నా’- గోపాలుడు.
‘రెండో వడపోత.. మంచి. ఆ వార్తలో
మంచి ఏమైనా ఉందా?’- భూపాలుడు.
‘ఊహూ…’- గోపాలుడు.
‘మూడో వడపోత… ప్రయోజనం. దాని వల్ల ఉపయోగం ఉందా?’- భూపాలుడు.
‘ఉపయోగమా, అబ్బే లేదు’- గోపాలుడు.
‘అది సత్యం కానప్పుడు, నేర్చుకోవాల్సిన మంచి లేనప్పుడు, ఎందుకూ ఉపయోగ పడనప్పుడు- ఆ మాటల్ని వినాల్సిన అవసరం లేదు. సెలవు’ అంటూ బయల్దేరాడు భూపాలుడు.