ScienceAndTech

2020 చివరలో కరోనా టీకా

Trump predicts corona virus vaccine will be ready by the end of 2020

ఈ ఏడాది చివరికి కరోనాకు టీకా సిద్దం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడి

వ్యాక్సిన్‌పై ప్రపంచవ్యాప్తంగా వంద ప్రయోగాలు

వాషింగ్టన్‌: కోవిడ్‌ టీకా ఈ ఏడాది చివరికల్లా సిద్ధమవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. కరోనా వైరస్‌ చికిత్సకు రెమిడెస్‌విర్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఫాక్స్‌ న్యూస్‌ చానల్‌ నిర్వహించిన టౌన్‌హాల్‌ కార్యక్రమంలో ఆయన చానల్‌ సోషల్‌ మీడియా ద్వారా అందిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందనే అనుకుంటున్నానని చెప్పారు.