మద్యపాన నిషేదంలో భాగంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మద్యం ధరలు పెంచారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ధరలు పెంచితే పేదవాడు మద్యానికి దూరం అవుతారని అమె అభిప్రాయపడ్డారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మద్యం ధరలు పెంచితే టీడీపీ నేతలు ఎందుదకు బాధపడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు మద్యాన్ని ఏరులై పారిస్తే.. సీఎం జగన్ దశలవారీగా మద్య నిషేధానికి శ్రీకారం చుట్టారని రోజా చెప్పారు. రాష్ట్రంలో 40 వేల బెల్టుషాపులు, 20 శాతం వైన్ షాపులు, 40 శాతం బార్లను తొలగించారని గుర్తు చేశారు. కరోనా కట్టడికి సీఎం జగన్ తీవ్రంగా కృషి చేస్తుంటే.. చంద్రబాబు,టీడీపీ నేతలు ఏసీ గదుల్లో కూర్చొని విమర్శలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు.
తెదేపాకు ఏంది నొప్పి?
Related tags :