విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమలో భారీ రసాయన ప్రమాదం. పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకై 3 కి.మీ మేర వ్యాపించింది. చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడం లో ఇబ్బందులు. స్థానికులు తీవ్ర అవస్థలు.
అపస్మారక స్థితిలో రహదారిపై పడిపోయిన కొందరిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలింపు. ప్రజలు భయాందోళనలతో తలుపులు వేసుకొని ఇళ్లలోనే ఉండిపోయారు. సైరన్‌లు మోగించి ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు హెచ్చరికలు జారీ. పరిసర ప్రాంతాల ప్రజలను ఇళ్ల నుంచి తరలింపు. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.