మత్స్యకారుల కోసం రాష్ట్రంలో తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నామని, సముద్రంలో వేట నిషేధకాలంలో ఒక్కో కుటుంబానికి పదివేల ఆర్థిక సాయం చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వెల్లడించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఒక్కో కుటుంబానికి రూ.పదివేలు అందించే మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని కంప్యూటర్ బటన్‌నొక్కి ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని లక్షా తొమ్మిది వేల మత్స్యకార కుటుంబాలకు మేలుచేసేలా, వారి ఖాతాల్లోకి నగదు జమ చేసినట్టు చెప్పారు. కరోనావల్ల కలిగిన ఇంత కష్ట సమయంలోను.. మత్స్యకార కుటుంబాలు పడుతున్న ఇక్కట్లే ఎక్కువ అని భావించామని, కచ్చితంగా వాళ్లకు మంచి జరగాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ఈసందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ప్రతి మత్స్యకారుడి కుటుంబానికి ₹10వేలు
Related tags :