కరోనాపై పోరాటం కోసం భారత మహిళల హాకీ జట్టు సహాయం అందించింది. 18 రోజుల పాటు ఫిట్‌నెస్ సవాళ్లతో సేకరించిన రూ.20 లక్షలను… కరోనా బాధితులకు సాయపడుతున్న ఢిల్లీకి చెందిన ఎన్‌జీఓ సంస్థ ఉదయ్ ఫౌండేషన్‌కు అందజేసింది. ఆ సంస్థ ఈ డబ్బును వలస కూలీలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న వారి కోసం ఉపయోగించనుంది. విరాళాలు సేకరించడానికి భారత హాకీ ప్లేయర్లు రోజుకు ఒకరు చొప్పున సామాజిక మాధ్యమంలో ఒక ఫిట్‌నెస్ చాలెంజ్‌ను విసిరి… ఆ చాలెంజ్‌ను స్వీకరించవలసినదిగా 10 మందిని నామినేట్ చేసేవారు. చాలెంజ్‌ను స్వీకరించిన ఆ పది మంది రూ.100 చొప్పున విరాళంగా ఇచ్చేవారు. అలా ఈ చాలెంజ్ మే 3వ తేదీ వరకు సాగింది. ‘మంచి పనిని ఆదరించడంతో పాటు అందులో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికీ మహిళల హాకీ జట్టు తరఫున కృతజ్ఞతలు’ అని జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ పేర్కొంది.
మహిళా హాకీ జట్టు భారీ విరాళం
Related tags :