ScienceAndTech

ఇటలీ వ్యాక్సిన్ సక్సెస్

Italians Claim First Successful CORONAVIRUS Vaccine

కరోనా వ్యాక్సిన్ గురించి ఇటలీ శాస్త్రవేత్తలు చేసిన ప్రకటన ఆశలు రేకిత్తిస్తోంది. తమ శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తయారుచేసినట్టు ఇటలీ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఎస్ఏ వెల్లడించింది. ‘టకీస్’రూపొందించిన ఈ వ్యాక్సిన్ ఎలుకలపై ప్రయోగం విజయవంతమైనట్టు తెలిపింది. మానవ కణాలపై పనిచేసే ఎలుకల్లో ప్రతినిరోధకాలను ఈ వ్యాక్సిన్ ఉత్పత్తిచేసినట్టు పేర్కొంది. ఈ వ్యాక్సిన్‌ను రోమ్‌లోని స్పల్లాంజనీ హాస్పిటల్‌లో పరీక్షించినట్టు వివరించింది.