Politics

స్మారక భవనంగా వేదనిలయం

Jayalalitha's Veda Nilayam Will Be Converted To Museum

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ‘అమ్మ’ జయలలిత నివాసం ‘వేద నిలయం’ను సేకరించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ నోటీసు జారీ చేసింది. పొయెస్ గార్డెన్‌లోని ఆమె నివాసాన్ని స్మారక కేంద్రంగా మార్చేందుకు నిర్ణయించింది. భూ సేకరణ అధికారి/రెవిన్యూ డివిజనల్ అధికారి సిఫారసు మేరకు ప్రభుత్వం /చెన్నై కలెక్టర్ ఈ భూమి, భవనాలు ప్రజా ప్రయోజనాల కోసం అవసరమని సంతృప్తి చెందినట్లు ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. మాజీ ముఖ్యమంత్రి, ‘అమ్మ’ జయలలిత నివాసం ‘వేద నిలయం’ను ప్రభుత్వ స్మారక కేంద్రంగా మార్చేందుకు అవసరమని తెలిపింది. ఈ కార్యక్రమం వల్ల కుటుంబాలు నిర్వాసితులు కావడం, వారికి పునరావాసం కల్పించడం వంటివేవీ ఉండవని తెలిపింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళని స్వామి 2018 ఆగస్టులో దీనికి సంబంధించిన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఆ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించింది.