DailyDose

మద్యం షాపుల ముందు మహిళల హడావుడి-వాణిజ్యం

Telugu Business News Roundup Today - Women In Front Of Wine Shops

* కరోనా వైరస్‌ సంక్షోభం వల్ల ఏర్పడిన లోటును పూడ్చుకోడానికి అప్పులు తెచ్చుకోవాలని, పన్నులు పెంచి ప్రజల మీద భారం వేయొద్దని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం కేంద్రానికి సూచించారు. ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయిన తరుణంలో కొత్త పన్నులు విధించడం తగదన్నారు. ‘కొత్తగా, పెద్ద ఎత్తున పన్నులు విధించడం వల్ల పేదలను మరింత పేదరికంలోకి తోసినట్లవుతుంది. కేంద్రం లోటును పూడ్చుకోడానికి అప్పులు తెచ్చుకోవాల్సిందే. ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయిన సమయంలో ప్రజల మీద పన్నుల భారం వేయొద్దు’ అని ట్వీట్‌ చేశారు. దేశం ఆర్థికంగా దూసుకుపోతున్న తరుణంలో పన్నులు పెంచినా ఓ అర్థం ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వమే ప్రజలకు డబ్బులు అందించి ఆదుకోవాలని తాము అభ్యర్థిస్తుంటే, ప్రభుత్వం మాత్రం పన్నులు విధించి అందుకు భిన్నంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ఇది చాలా క్రూరమైన చర్య అని విమర్శించారు. . కొవిడ్ 19 కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఏర్పడిన లోటును భర్తీ చేసుకోడానికి కేంద్రం మంగళవారం పెట్రోలు, డీజిల్ మీద ఎక్సైజ్‌ డ్యూటీని పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దిల్లీ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు మద్యం అమ్మకాల ద్వారా రాబడి పెంచుకోవాలని చూస్తున్నాయి.

* కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంచడంపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కష్టాల వేళ పెట్రో ధరలు పెంచడం ఏంటంటూ ఆయన ట్వీట్ చేశారు. లాక్‌డౌన్‌తో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ధరలు తగ్గించేది పోయి పెంచుతారా అని ప్రశ్నించారు. కేంద్ర నిర్ణయం సరికాదని, వెంటనే వెనక్కు తీసుకోవాలని రాహుల్ కోరారు.

* కరోనా సంక్షోభం, ఆర్థిక మాంద్యంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో ముచ్చటించిన ప్రముఖ ఆర్థిక వేత్త నోబెల్‌ గ్రహీత అభిజిత్‌ బెనర్జీ మంగళవారం కీలక అభిప్రాయాలను వ్యక్తంచేశారు. మహమ్మారి కారణంగా ప్రభావితమైన వ్యాపారాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే ప్రజల చేతుల్లోకి నగదు చేరాలంటే కేంద్రం భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాల్సి వుందని బెనర్జీ సూచించారు. నిరుపేదలకు నగదు బదిలీ సౌకర్యం తప్పనిసరిగా ఉండాలని బెనర్జీ అన్నారు. కోవిడ్-19 మహమ్మారి ప్రభుత్వాల ముందు పెద్ద సవాలు విసిరిందని, చాలా మంది ఉద్యోగాలు కోల్పోవచ్చన్న రాహుల్ వ్యాఖ్యాలను అంగీకరించిన ఆయన ఈ సూచన చేశారు. అంతేకాదు వీలైనంత తొందరగా లాక్‌డౌన్‌ నుంచి బయటపడాలన్నారు. కరోనా వైరస్ మహమ్మారి స్వభా

* దాదాపు 45 రోజుల తర్వాత రాష్ట్రంలో మద్యం షాపులు తెరుచుకోవడంతో.. మందుబాబుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. మద్యం కోసం చాలా మంది ఉదయం నుంచే వైన్స్‌ ముందు క్యూ కట్టారు. పలు చోట్ల మహిళలు కూడా మద్యం కోసం లైన్లలో వేచి ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలోని కొండాపూర్‌, పంజాగుట్ట, మాదాపూర్‌ లలో వైన్‌ షాపుల ముందు మహిళలు క్యూ నిల్చున్న దృశ్యాలు కనిపించారు. మరి కొన్ని చోట్ల వృద్ధ మహిళలు మద్యం కోసం వైన్‌ షాపుల వద్దకు వచ్చారు.