Politics

విచారణ చేయండి

Chandrababu Demands Enquiry Into Vizag Gas Leak

గ్యాస్‌ లీకేజీ ప్రమాదం జరిగిన విశాఖ ఆర్‌.ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలీమర్స్‌ పరిశ్రమను తక్షణమే మూసివేసి సమగ్ర విచారణ చేపట్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు లేఖ రాశారు. పరిశ్రమలో జరిగిన గ్యాస్‌ లీకేజీ కారణంగా దాదాపు 2వేల మంది అనారోగ్యానికి గురికావడం బాధాకరమన్నారు. ప్రజారోగ్యంపై తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓ వైపు కరోనా బాధితులు.. మరోవైపు విషవాయువు వల్ల అనారోగ్యం పాలైనవారు ఉన్నందున నిపుణులైన వైద్యసిబ్బందిని ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. ప్రమాదంలో మూగజీవాలు సైతం అనారోగ్యం పాలైనందున పశు వైద్యులను పంపాలని కోరారు. ఎల్‌జీ పాలీమర్స్‌ పరిశ్రమను కాలుష్యంలేని ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌)కి తరలించాలని సూచించారు. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకూ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు నిపుణులను పంపించాలని లేఖ ద్వారా కోరారు.