* ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితి పెరిగింది. గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. తమిళనాడులో ప్రస్తుతం ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితి ‘58’ సంవత్సరాలుగా ఉండగా…దీనిని ‘59’ సంవత్సరాలకు పెంచారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయి.
* రమేష్ కుమార్ తొలగింపుపై విచారణను శుక్రవారానికి వాయిదా వేసిన హైకోర్టు. అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎస్ఈసీ రమేష్ కుమార్ తొలగింపుపై తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఎస్ఈసీ సర్వీస్ నిబంధనలను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉందని అడ్వకేట్ జనరల్ చెప్పారు.
* భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా టీ20 మహిళల ప్రపంచ కప్ ఫైనల్ సందర్భంగా వైరల్ అయిన తన ‘జోరు కా గులాం’ (భార్యా దాసుడు) ట్వీట్‌పై గురువారం వివరణ ఇచ్చారు. ఆస్ర్టేలియాతో భారత్ తలపడిన ఆ మ్యాచ్‌కు ఆస్ర్టేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ వన్డే మ్యాచ్‌కు డుమ్మా కొట్టి మరీ తన భార్య, మహిళా క్రికెట్ స్టార్ హీలీ కోసం టైటిల్ పోరును వీక్షించేందుకు రావడంపై సానియా ఈ ట్వీట్ చేశారు. మిచెల్ స్టార్క్ ఈ మ్యాచ్‌కు హాజరవడంపై అందరి ప్రశంసలు అందుకున్నారు.
* ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధిత కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం కన్నా మీడియాతో మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ తరపున ముఖ్యమంత్రికి అభినందనలు తెలియజేశారు. మానవ తప్పిదం వలనే ప్రమాదం జరిగిందని అన్నారు. వైజాగ్‌లో జరిగిన సంఘటన దురదృష్టకరమని, అలారం మోగించకపోవడం యాజమాన్యం తప్పుగా ఆయన పేర్కొన్నారు.
* లాక్‌డౌన్ కారణంగా చాలా కాలం తరువాత పరిశ్రమలు ప్రారంభించడంతో గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. విశాఖలో జరిగిన యల్‌జీ గ్యాస్ లీకేజీ మరువక ముందే చత్తీస్‌ఘర్ లోని పేపర్ మిల్లులో గ్యాస్ లీక్ అయ్యి ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పుడు తాజాగా తమిళనాడులోని కడలూరు కోల్ మైనింగ్ కంపెనీలో బాయిలర్ పేలి ఏడుగురు గాయాలపాలయ్యారు.
* సినిమాటోగ్రాఫర్ నదీమ్‌ఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆయన భార్య, గాయని పార్వతి తెలిపారు. ప్రస్తుతం నదీమ్ వెంటిలేటర్‌పై ఉన్నారని, ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదని ఆమె తెలిపారు. నదీమ్ ఖాన్ సోమవారం సాయంత్రం ఇంట్లో మెట్ల మీద నుంచి దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. దీంతో తల, భుజం, ఛాతికి దెబ్బలు తగలడంతో ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. మంగళవారం ఉదయం అతనికి బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. కాగా నదీమ్ ఖాన్ ప్రముఖ హిందీ కథారచయిత రాహి మసూమ్ రాజా కుమారుడు. నదీమ్ ఖాన్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆయన భార్య మాట్లాడుతూ.. ‘ఆయన ఐసీయులో వెంటిలేటర్‌పై ఉన్నారు. అతను స్పృహలో లేరు. ఆయన స్పందించడానికి 48 నుంచి 72 గంటలు పడుతుందని వైద్యులు తెలిపారు. అతను ఎప్పుడు స్పందిస్తారని వేచి చూస్తున్నాం. నదీమ్ నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు’. అని పార్వతి తెలిపారు.
* కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం పోరాడుతోంది. అగ్రరాజ్యంతో సహా అన్ని దేశాలను ఒక చిన్న కరోనా వైరస్ వణికిస్తోంది. పోరాటం అంటే ఏంటో తెలిసేలా చేస్తోంది. చేతులు కడుక్కునే సంప్రదాయాన్ని, శుభ్రంగా ఉండే అలవాట్లను కూడా మరో వైపు ప్రపంచానికి తెలియజేస్తోంది. దీంతో చాలా మంది వారికి పుట్టిన నవ శిశువులకు కరోనా, కోవిడ్, లాక్‌డౌన్ అంటూ వివిధ రకాల పేర్లు పెడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి తృణమూల్ కాంగ్రెస్ ఆరమ్ బాగ్ ఎంపీ అపరూప పొద్దార్ కూడా చేరారు.
* లాక్‌డౌన్‌లో సమయంలో తమ సోంత రాష్ట్రాలకు తిరిగి పయనమవుతున్న క్రమంలో సుమారు 42 మంది వలస కార్మికులు రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లు సేవ్ లైఫ్ ఫౌండేషన్ తమ నివేదికలో పేర్కొంది. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు మార్చి 24 నుంచి మే 3 వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌కు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాలపై సేవ్ లైఫ్ ఫౌండేషన్ వారు నివేదికను తయారు చేసింది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌లో రోడ్డు ప్రమాదాల వల్ల మొత్తం 140 మంది మరణించినట్లు నివేదికలో వెల్లడించింది.