* విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంలో 10 కి చేరిన మృతుల సంఖ్యవివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న బాధితులు. సీరియస్ గా ఉన్న వారిని కేజీహెచ్ కు తరలింపు. పరిశ్రమ రన్నింగ్ లో లేకపోవడం వలనే ప్రమాదంలాక్ డౌన్ కారణంగా ఫ్యాక్టరీ మూతపడింది. సిస్టమ్స్ అన్ని రన్నింగ్ లో లేకపోవడం వల్లే దుర్ఘటన జరిగింది.సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు ఎవరూ ఇటువైపు రావొద్దూ — ఎల్జీ పాలిమర్స్ జీఎం.
* బాధితులకు అండగా ఉంటాము. ఎవ్వరూ అధైర్య పడొద్దు. చనిపోయిన వారిని నేను తిరిగి తీసుకుని రాలేను కానీ మనసున్న వాడిగా మాత్రం వారికి అండగా ఉంటాచనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయలువెంటిలేటర్ మీద ఉన్న వారికి 10లక్షలుహాస్పిటల్ వార్డుల్లో ఉన్న వారికి లక్ష రూపాయలుఆ ప్రాంతంలో ఇబ్బందికి గురి అయిన వారికి 25 వేలు – సీఎం వైయస్ జగన్
* ఎల్. జి పొలిమర్స్ హిస్టరీ.ఎల్. జి సౌత్ కొరియకి చెందిన కంపిని.ఎల్.జి కంపిని విశాఖలో 1961వ సంవత్సరంలో స్థాపించారు.ఎల్.జి మొదట భారత్ లో తమ అనుబంధ సంస్థగా 1961లో హిందూస్థాన్ పొలిమర్స్ కి అనుమతి ఇచ్చి హిందూస్థాన్ పోలిమర్స్ ని స్థాపించింది.1978 లో పూర్తి స్థాయిలో ఎంసి డో వెల్, యూబీ గ్రూప్ ఎల్. జి అనుమతి తో హిందూస్తాన్ పొలిమర్స్ ని టెకోవర్ చేసుకున్నారు .1997లో ఎల్. జి పూర్తి స్థాయిలో యూబీ గ్రూప్, ఎంసి డో వెల్ నుంచి టెకోవర్ చేసుకుంది.
* విశాఖ గ్యాస్ లీక్ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంది. బాధితులు వైద్యం కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయాల్సిన పనిలేదు. ఏ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నా మొత్తం ఖర్చు ప్రభుత్వమే చెల్లిస్తుంది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి చొప్పున ఆర్థికసాయం ప్రకటించడం జరిగింది. చికిత్స పొందుతున్న వారికి రూ. లక్ష ఆర్థిక సాయం, వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న వారికి రూ.10లక్షలు ఆర్థిక సాయం, ప్రాథమిక చికిత్స పొందినవారికి రూ. 25వేలు ఆర్థిక సాయం ప్రకటించాం. గ్యాస్ లీక్ వల్ల చుట్టుపక్కల ఉన్న 5 బాధిత గ్రామాల్లోని 15వేల మందికి రూ. 10వేలు అందజేస్తాం. జంతునష్టం జరిగినవారికి కూడా ఒక్కో జంతువుకు రూ25వేలు చొప్పున పరిహారం అందజేస్తాం.
* విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. కేబినెట్ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, కెమికల్ మినిస్ట్రీ కార్యదర్శిలతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. గ్యాస్ లీకేజీ ఘటనపై గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ , మంత్రులు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, కిషన్ రెడ్డి, కేబినెట్ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్యాస్ లీకేజీ ఘటనకు దారి తీసిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఈ ఘటనపై ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గ్యాస్ ప్రభావం తగ్గింపు, బాధితులకు సహాయంపై ఈ కమిటీ చర్యలు తీసుకోనుంది.
* వైజాగ్ లోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి ప్రమాదకర వాయువు లీకవడం, ఎక్కడివాళ్లు అక్కడే కుప్పకూలిపోవడం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎనిమిది మంది మృతి చెందగా, వందల మంది వైజాగ్ లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, వైజాగ్ లో మరోసారి గ్యాస్ లీకైందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ప్రజలు మరింత భయాందోళనలకు గురవుతున్నారు. దీనిపై ఏపీ పోలీస్ విభాగం స్పందించింది.
* విశాఖ గ్యాస్ లీక్ ఘటన ఎందరినో పొట్టన పెట్టుకుంది. ఘటనలో విషవాయువు పీల్చి ఎంబీబీఎస్ విద్యార్ధి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. చంద్రమౌళి ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. తమ కుర్రాడు డాక్టరై ఎందరో ప్రాణాలు కాపాడతాడని తల్లిదండ్రులు ఆశించారు. అయితే ఇంతలోనే విషవాయువు విద్యార్ధి ప్రాణాలు తీసింది. చంద్రమౌళి తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చింది.
* విశాఖపట్నం మృతుల వివరాలుఇద్దరు చిన్నారులు కూడా మృతి. కుందన శ్రేయ (6), ఎన్.గ్రీష్మ (9), చంద్రమౌళి (19) మృతి. గంగాధర్, నారాయణమ్మ, నరసమ్మ, గంగరాజు, కృష్ణ మూర్తి మృతి. మృతుడు చంద్రమౌళి ఏఎంసీలో ఎంబీబీఎస్ విద్యార్థి . విశాఖపట్నంలోని ఆర్‌ఆర్ వెంకటాపురంలో ఓ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకైన ఘటనపై మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య 9కి చేరిందని చెప్పారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
* విశాఖ గ్యాస్ ఘటనపై దేశ ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..విశాఖ ప్రమాదంపై హోంశాఖ అధికారులతో ప్రధాని మోదీ అరా..కాసేపట్లో ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో మాట్లాడిన ప్రధాని మోదీ..కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సాయం అందిస్తామన్న మోదీ.
* విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదానికి ఎల్‌జీ పాలిమర్స్ యాజమాన్య నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయింది.లాక్‌డౌన్‌లోనూ పరిశ్రమలో ప్రతిరోజు మెయింటెనెన్స్ చేయాల్సి ఉన్నప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. లాక్‌డౌన్ ఉన్నకారణంగా మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం పాస్‌లు కూడా ఇచ్చింది.45 మందికి మెయింటెనెన్స్ పాస్‌లు ఇచ్చినప్పటికీ.. యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పరిశ్రమ ట్యాంకుల్లో దాదాపు 2 వేల మెట్రిక్ టన్నుల స్టైరెన్‌ను నిల్వ చేసింది. అక్కడ 20 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత ఉంచడంలో ఫ్యాక్టరీ యాజమాన్యం విఫలమైంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో.. స్టైరెన్ లీక్ అయి మంటలు చెలరేగాయి. దీంతో ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలకు స్టైరెన్ గ్యాస్ వేగంగా వ్యాప్తి చెందింది. కాగా, గురువారం తెల్లవారుజామన చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 8మంది మృతిచెందగా, దాదాపు 300 మంది అస్వస్థతకు లోనయ్యారు.
* విశాఖలోని ఆర్ ఆర్ వెంకటాపురంలో జరిగిన దుర్ఘటన తీవ్రతపై ఓ స్థానికుడు స్పందించాడు. రాత్రి సుమారు 2.30 నిమిషాల సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా ఈ విషవాయువులు వ్యాప్తి చెందాయని స్ధానికంగా ఉంటున్న నవీన్ అనే యువకుడు తెలిపాడు. ఈ వాయువు పొగమంచు మాదిరిగా వేగంగా చుట్టముట్టేయడంతో ప్రజలు ఎటూ పోలేని పరిస్థితి వచ్చిందని అతను తెలిపాడు. ఈ విషవాయువు వల్ల ఊపిరి తీసుకోలేని స్థితిలో ప్రజలు ఉన్నారని అతను తెలిపాడు. అంతేకాక శరీరం అంతా మంటలు, కంటిలో నుంచి నీళ్లు రావడం జరిగిందని తెలిపాడు. రోడ్డుపై నడుస్తుండగానే ఎవరంతట వాళ్లే క్రిందపడిపోయారని అన్నాడు. ఇంత జరుగుతున్నా ఎల్జీ పాలిమర్స్ కంపెనీ యాజమాన్యం మాత్రం పట్టించుకోలేదని యువకుడు వాపోయాడు. వారి వద్ద కార్లు ఉన్నా అపస్మాకరకస్థితిలో రోడ్డుపై పడి ఉన్న వారిని కాపాడేందుకు ముందుకు రాలేదని అతను తెలిపాడు. ఇప్పటికైనా ఈ కంపెనీని ప్రభుత్వం వెంటనే మూయించాలని అతను కోరాడు.
* విశాఖపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విష వాయువులు విడుదలై అయిదు కిలోమీటర్ల మేర ప్రజలు భయకంపితులు కావడం… 8 మంది మృతి చెందటం… వందల మంది తీవ్ర అస్వస్థతకు లోనవడం హృదయవిదారకం. మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. అస్వస్థతకు గురైనవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి. మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించాలి.
* ఎల్జి పాలిమర్స్ 1997 లో ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలో నెలకొల్పబడింది, 213 ఎకరాల విస్తీర్ణంలో 168 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయం తో ఈ సంస్థ ప్రారంభమైంది, ఈ కంపెనీ ప్రతిరోజు 417 టన్నుల పొల్య్స్త్య్రెనె ను ఉత్పత్తి చేస్తుంది, దీన్ని స్త్య్రెనె అనబడే ముడిసరుకు ద్వారా ఉత్పత్తి చేస్తారు, ప్రస్తుతం స్త్య్రెనె గ్యాస్ లీక్ అయింది, ఈ గ్యాస్ వల్ల తొలుతగా తలనొప్పి, వినికిడి సమస్య, నీరసం, కళ్ళు మంటలు, వస్తాయి, ఇదే గ్యాస్ ను ఎక్కువగా పిలిస్తే క్యాన్సర్, కిడ్నీ వంటి వ్యాధులతో బాధ పడే అవకాశం ఉంది, గతంలో కూడా ఈ ఎల్ జి పాలిమర్స్ కంపెనీ నుంచి గ్యాస్ లీక్ వచ్చినప్పటికీ కంపెనీ యాజమాన్యం వెంటనే అప్రమత్తమై వాటిని అరికట్టే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం, ఈ కంపెనీ డైరెక్టర్ గా పిపి రామచంద్ర మోహన్ ఫోన్ నెంబర్ 9100040246 గా సమాచారం.