Politics

వైకాపాకు అత్యధిక విరాళాలు

YSRCP Receives Highest Number Of Donations In 2019

విరాళాల సేకరణలో దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల్లో వైసీపీ తొలిస్థానంలో నిలిచింది. 2018-19 సంవత్సరానికి సంబంధించి ప్రాంతీయ పార్టీల్లో వైసీపీకి అత్యధిక విరాళాలు లభించాయి. ఆ ఏడాది వైసీపీకి 142 సంస్థలు, వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు ఇచ్చిన విరాళాల మొత్తం రూ.80.57 కోట్లు. వీటిలో రూ.70.61 కోట్లు 43 కార్పొరేట్‌, వ్యాపార సంస్థలు ఇవ్వగా, 78 మంది వ్యక్తుల నుంచి రూ.9.74 కోట్లు అందాయి.
*2018-19లో కేంద్ర ఎన్నికల సంఘానికి దేశవ్యాప్తంగా 25 ప్రాంతీయ పార్టీలు తమకు అందిన విరాళాల వివరాలను నివేదిక రూపంలో అందించాయి. ఆయా వివరాలను అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రాటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) సంస్థ అధ్యయనం చేసి బుధవారం వెల్లడించింది. ఏడీఆర్‌ అధ్యయనం మేరకు.. అత్యధిక విరాళాలు లభించిన పార్టీగా వైసీపీ తొలిస్థానంలో నిలవగా రెండో స్థానంలో తెలంగాణ అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ నిలిచింది. 2018-19లో టీఆర్‌ఎస్‌ పార్టీకి రూ.41.27 కోట్లు విరాళాల రూపంలో అందాయి. టీడీపీకి రూ.26.17 కోట్లు, ఒడిసా అధికార పార్టీ బీజేడీకి రూ.26 కోట్లు విరాళాలుగా అందాయని ఏడీఆర్‌ వివరించింది.
*ఆయా పార్టీలకు 2017-18లో అందిన విరాళాలతో పోల్చితే 2018-19లో భారీగా పెరిగాయి. వైసీపీ, టీడీపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలకు విరాళాలు పెరిగాయని ఏడీఆర్‌ సంస్థ విశ్లేషించింది. 2017-18లో వైసీపీకి రూ.8.35 కోట్లురాగా.. 2018-19కి అవి రూ.80.57కి పెరిగాయి. టీడీపీకి 2017-18లో రూ.1.73 కోట్లు లభించగా.. 2018-19లో రూ.26.17 కోట్లు లభించాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ విరాళాలు 2017-18లో రూ.3.3 కోట్లు లభించగా… 2018-19లో ఆ పార్టీకి రూ.41.27 కోట్లు విరాళాలుగా వచ్చాయి.
*విరాళాల సేకరణలో టీఆర్‌ఎస్‌ సెకండ్‌
విరాళాల సేకరణలో వైఎ్‌సఆర్‌సీపీ తొలి స్థానంలో నిలిచింది. 2018-19 సంవత్సరానికి సంబంధించి ప్రాంతీయ పార్టీల్లో వైసీపీకి అత్యధిక విరాళాలు లభించాయి. ఈ ఏడాదిలో 142 సంస్థలు, వ్యక్తులు కలిపి రూ.80.57 కోట్లు వైసీపీకి విరాళంగా వచ్చాయి. ఈ మొత్తంలో రూ.70.61 కోట్లను 43 కార్పొరేట్‌, వ్యాపార సంస్థలు ఇవ్వగా…78 మంది రూ.9.74 కోట్లు ఇచ్చారు. 2018-19లో కేంద్ర ఎన్నికల సంఘానికి దేశవ్యాప్తంగా ఉన్న 25 ప్రాంతీయ పార్టీలు సమర్పించిన విరాళాల జాబితాను అధ్యయనం చేసి రూపొందించిన నివేదికను ఏడీఆర్‌ సంస్థ బుధవారం వెల్లడించింది. దీని ప్రకారం అత్యధిక విరాళాలు వైసీపీకి లభించి మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నిలిచింది. ఆ ఏడాది టీఆర్‌ఎ్‌సకు రూ.41.27 కోట్లు విరాళాల రూపంలో అందాయి. ఆ తర్వాత స్థానంలో రూ.26 కోట్లతో బీజేడీ, రూ.26.17 కోట్లతో తెలుగుదేశం పార్టీలున్నాయి.