DailyDose

ఏపీలో పెరిగిన పాజిటివ్ కేసులు-TNI కరోనా బులెటిన్

COVID19 Positive Cases Rise In Andhra-TNILIVE Corona Bulletin

* ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య ప్రతీరోజూ భారీగానే పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో రెండంకెల కేసులు నమోదు అవుతున్నాయి. ఏపీ సర్కార్ తాజాగా విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 54 కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో ఇవాళ మూడు మరణాలు సంభవించాయి. కర్నూలులో ఇద్దరు విశాఖలో ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి ఇప్పటి వరకు 41 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1887కు చేరింది. 842 మంది డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 1004 మంది చికిత్స పొందుతున్నారు. ఇక, మరోసారి కర్నూలులోనే భారీగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

* ఏపీ లో ఈరోజు కొత్తగా 54 కేసులు మొత్తం 1887 చేరిన బాధితులు

* దేశవ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో వలస కూలీలు తమ స్వ రాష్ట్రాలకు తరలి వెళ్తుండగా హైదరాబాద్ కు మాత్రం బీహార్ రాష్ట్రంలోని ఖగారియా నుండి ప్రత్యేక శ్రామిక్ ఎక్సప్రెస్ రైలులో లింగంపల్లి స్టేషన్ కు చేరుకున్న కూలీలు.

* దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3390 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా,103 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 56,342కి చేరింది. ప్రస్తుతం 37,916 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 16,540 మంది డిశ్చార్జ్ కాగా 1,886 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ ‌అగర్వాల్‌ శుక్రవారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. దేశంలో కరోనా రికవరీ రేటు 29.36 శాతం ఉందన్నారు. భారత్‌లో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఎక్కువ భాగం మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీలోనే ఉన్నాయని ఆయన తెలిపారు.

* కరోనా మహమ్మారితో అత్యవసర పరిస్థితి నెలకొన్న క్రమంలో పేదల ఖాతాల్లో నేరుగా రూ . 7500 జమచేయాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. కుదేలైన చిన్నమధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) తక్షణ సాయం చేయని పక్షంలో నిరుద్యోగం సునామీలా చుట్టుముడుతుందని హెచ్చరించారు. మే 17తో లాక్‌డౌన్‌ ముగుస్తున్న క్రమంలో పారదర్శకతతో కూడిన ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు రావాలని ఆయన కోరారు.

* మరింత విజయవంతంగా టెలి మెడిసిన్‌. ఫోన్‌ చేసిన 24 గంటల్లోనే పూర్తి వైద్య సేవలు. పీహెచ్‌సీలలో తప్పనిసరిగా బైక్‌లు, థర్మో బ్యాగ్‌లువీలైనంత త్వరగా అందుబాటులో ఉంచాలి: సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశం.