శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి బ.విదియ ప.12.56 వరకు తదుపరి, తదియ, నక్షత్రం అనూరాధ ఉ.9.05 వరకు తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం ప.2.30 నుంచి 4.03 వరకు దుర్ముహూర్తం ఉ.5.35 నుంచి 7.14 వరకు అమృతఘడియలు… రా.11.44 నుంచి 12.54 వరకు.
సూర్యోదయం : 5.35
సూర్యాస్తమయం : 6.16
రాహుకాలం : ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుంచి 3.00 వరకు
గ్రహఫలం
మేషం: ఆదాయం నిరాశ కలిగిస్తుంది. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. పనుల్లో ఆటంకాలు. వ్యాపారులకు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు.
వృషభం:కుటుంబసభ్యుల సలహాలు పొందుతారు. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు వివాదాలు తీరతాయి. వాహనయోగం.
మిథునం: కొత్త వ్యవహారాలు చేపడతారు. బంధువుల నుంచి శుభవర్తమానాలు. శుభకార్యాల ప్రస్తావన. వస్తులాభాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం. వాహనయోగం. దైవదర్శనాలు.
కర్కాటకం: కొన్ని వ్యవహారాలు వాయిదా వేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తిలాభం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు, పనిభారం.
సింహం: బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అప్పులు చేస్తారు. కొన్ని వ్యవహారాలలో అవరోధాలు. స్వల్ప అనారోగ్యం. దైవచింతన. వ్యాపారాలలో ఒత్తిళ్లు. ఉద్యోగాలలో గందరగోళం.
కన్య: కుటుంబసభ్యులతో విభేదాలు తొలగుతాయి. చేపట్టిన కార్యక్రమాలలో విజయం. విద్యావకాశాలు. శుభవర్తమానాలు. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. దేవాలయ దర్శనాలు.
తుల: కార్యక్రమాలు ముందుకు సాగవు. ధనవ్యయం. ప్రయాణాలలో ఆటంకాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో సమస్యలు ఎదురుకావచ్చు.
వృశ్చికం: శుభకార్యాలకు హాజరవుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వృద్ధఇ. వ్యాపారాలలో అధిక లాభాలు. ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది. వాహనసౌఖ్యం.
ధనుస్సు: కుటుంబసమస్యలు ఎదురుకావచ్చు. కార్యక్రమాలలో స్వల్ప ఆటంకాలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం. దూరప్రయాణాలు.
మకరం: పనులు విజయవంతంగా సాగుతాయి. బంధువుల నుంచి శుభవర్తమానాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో సంతోషకరమైన వార్తలు.
కుంభం: పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. పనులు చకచకా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. పరపతి పెరుగుతుంది.
మీనం: కొత్తగా రుణాలు చేస్తారు. కొన్ని పనుల్లో అవాంతరాలు. కుటుంబంలో కొన్ని సమస్యలు. ఆలయాల దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు కొంత నిరాశ.