బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణ తుది గడువును సుప్రీంకోర్టు మరో మూడు నెలలు పొడిగించింది. ఈ కేసును తొమ్మిది నెలల్లోగా ముగించాలని ప్రత్యేక న్యాయమూర్తి ఎస్‌కే యాదవ్‌ను గత ఏడాది జూలైలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అయితే కేసులో మరిన్ని ఆధారాలు సేకరించాల్సి ఉన్నదని, గడువును పొడిగించాలని ఇటీవల కోరారు. దీనిపై జస్టిస్‌లు ఆర్‌ఎఫ్ నారీమన్, సూర్యకాంత్‌తో కూడిన దర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఆగస్టు 31లోగా తీర్పు వెల్లడించాలని ఆదేశించింది. మరోసారి గడువు పెంచబోమని స్పష్టంచేసింది.
మరోసారి పొడిగింపు ఉండదు
Related tags :