Movies

విప్లవాత్మక కథల చిరునామా…టీ.కృష్ణ

Remembering The Revolutionary Director - T Krishna

ఈయన 1927లో వరంగల్లు జిల్లా రాయిపర్తిలో జన్మించాడు. ఇతడు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 1948లో బి.ఎ. పూర్తి చేశాడు. కొంతకాలం గోలకొండ పత్రికలో సినిమా సమీక్షలు వ్రాయడం, హైదరాబాదులోని ఆలిండియా రేడియోలో గ్రామస్తుల కార్యక్రమాలలో “లింగడు” అనే తెలంగాణ యాసలో మాట్లాడే పాత్రను నిర్వహించడం వంటివి చేశాడు. సినిమాలలో పనిచేయాలనే బలమైన కోరికతో 1950లో మద్రాసు చేరుకున్నాడు. హెచ్.ఎం.రెడ్డి వద్ద దర్శకత్వశాఖలో అప్రెంటీస్‌గా చేరాడు. ఆదర్శం అనే సినిమాలో సావిత్రికి జంటగా ఒక హాస్యపాత్రలో నటించాడు. అదే చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. ఎం.వి.రాజన్ వద్ద ఎడిటింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. రాజ్ కపూర్ తీసిన ప్రేమలేఖలు సినిమాలో “ప్రాణ్”కు తెలుగులో డబ్బింగ్ చెప్పాడు. అమర సందేశం చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టరుగా, అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేశాడు. కృష్ణ ప్రేమ చిత్రంతో ఇతను పూర్తి స్థాయి ఎడిటర్‌గా మారి 30కి పైగా చిత్రాలకు ఎడిటర్‌గా ఉన్నాడు. ఇతడు దర్శకత్వం వహించిన తొలి సినిమా ఉపాయంలో అపాయం. ఈయన ప్రతిఘటన, రేపటి పౌరులు, నేటి భారతం వంటి విజయవంతమైన విప్లవాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఈ తరం పిక్చర్స్ సంస్థని స్థాపించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. ఈయన మలయాళంలో కూడా కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ప్రముఖ తెలుగు నటుడు తొట్టెంపూడి గోపీచంద్ ఈయన కుమారుడే. ఈయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మే 8, 1987 న మరణించాడు.