జిల్లాలోని గోదావరిఖనిలోని ఎండీహెచ్‌డబ్ల్యూఎస్ అనాథ పిల్లల సంరక్షణ కేంద్రం నిర్వాహకుడు, దివ్యాంగుడు పోచంపల్లి రాజయ్య మూగజీవాల ఆకలి తీరుస్తున్నాడు. తనకు వచ్చే పింఛన్ డబ్బులకు ప్రభుత్వం ఇచ్చిన కరోనా సాయం రూ.3 వేలను వెచ్చించి ఆకలితో అలమటిస్తున్న కోతులకు అన్నం, పండ్లు పెడుతున్నాడు. గత కొన్ని రోజులుగా 30 కిలోమీటర్ల దూరంలోని మంథని-కాటారం మార్గమధ్యలో అటవీ ప్రాంతానికి బైక్‌పై వెళ్లి వానరాలకు ఆహారం అందిస్తున్నాడు. మూగజీవాల ఆకలి తీర్చడం తృప్తిగా ఉందని చెబుతున్న రాజయ్యను స్థానికులు అభినందిస్తున్నారు.
30కిమీ అడవిలోకి వెళ్లి…₹3వేలు ఖర్చు పెట్టి…వానరాల ఆకలి తీర్చి…
Related tags :