పూరిలో జగన్నాథ రథయాత్రను నిర్వహించే నిర్ణయం ఒడిశా ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జగన్నాథ ఆలయ కార్యాలయం నుంచి శ్రీ నహార్ ప్యాలెస్ ముందు ఉన్న గ్రాండ్ రోడ్‌కు ఇరువైపులా ఉన్న రథాఖాలాలో రథాల నిర్మాణానికి అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొంది.పూరీలో వార్షిక ఉత్సవాలకు రథాల నిర్మాణాన్ని చెపట్టడానికి రాష్ట్రప్రభుత్వం అనుమతి కోరుతూ లేఖ రాయడంలో ఢిల్లీ నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. రథఖాలా ప్రాంతంలో ఎటువంటి పూజలు నిర్వహించకూడదని ఆదేశించింది. రథాల నిర్మాణం చేపట్టే భక్తులు బౌతిక దూరం పాటించాలని ఆదేశించింది. జూన్ 23వ తేదీన జరగనున్న రథయాత్రను రాష్ట్ర ప్రభుత్వం అప్పటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటుందని లేఖలో పేర్కొంది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్ మార్గదర్శకాల ప్రకారం ఎటువంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడానికి వీలులేదు. శ్రీ జగన్నాథ ఆలయ మేనేజింగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ… రథాఖాలా ప్రాంతంలో ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించమన్నారు. రథఖాలా ప్రాంతం చుట్టూ గోడ ఉన్నందున సాధారణ ప్రజలకు, భక్తులకు అందులోకి వచ్చే వీలు లేదని పేర్కొన్నారు. కోవిడ్-19 నిబంధనలు అనుసరించి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు.
రథయాత్ర జరిగేనా?
Related tags :