విశాఖలో జరిగిన ప్రమాదానికి కారణం ‘నేటి ప్రభుత్వ పరిపాలనా లోపం’ అని డాకుమెంట్లు స్పష్టం చేస్తున్నాయి. సదరు ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ‘ప్రొడక్షన్ రెట్టింపు చెయ్యాలి’ అంటే ముందుగా ‘ఇఐఏ’
అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. సదరు కంపెనీ తీసుకోలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవేమీ లేకుండా… నిబంధనలకు విరుద్ధంగా హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంక్ డిడి.నెం. 530240005, తేది: 29, 04 2019 కేవలం రూ.4.50ల లక్షల బ్యాంకు పూచీకత్తుతో ఈ కంపెనీకి అనుమతి ఇచ్చింది.
పొడిగింపు ఎలా..?:
ఈ కంపెనీ చుట్టూ 2 కిలో మీటర్ల పరిధిలో జనావాసాలు ఉన్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోకుండానే ప్రభుత్వం ‘ప్రొడక్షన్’ రెట్టింపుకి ఎలా అనుమతులు ఇచ్చింది.? ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం మాత్రమే.!
అండర్ టేకింగ్ కూడా..:
1997లో ప్రస్థానం మొదలెట్టిన ఎల్జీ పాలిమర్స్ కంపెనీ మే9, 2019న ప్రభుత్వానికి అండర్ టేకింగ్ ఇచ్చింది. విశాఖపట్నం, వెంకటాపురం గ్రామంలోని
సర్వే నెం. 1 నుంచి 46, పెందుర్తి మండలం, వేపగుంట గ్రామంలో సర్వే నెం.111 నుంచి 118 వరకు ఈ కంపెనీ తన కార్యక్రమాలకు అనుమతి పొందింది. అనంతరం లెటర్ నెం. ఎస్& ఇ / ఇసి/ 2019-01 ద్వారా తమ సామర్థ్యాన్ని పెంచమని అడిగింది. జరగాల్సిన మతలబు అంతా ఇక్కడే నిశ్శబ్దంగా జరిగిపోయింది.
ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (యు 25203ఏపి1996పిటిసిఓ25917( ప్రకారం ఏడుగురు డైరెక్టర్లలో కార్యదర్శి ఒకరు కంపెనీ అర్హతల ప్రకారం డిస్ క్వాలిఫై అయ్యారు. అయినా ఈ కంపెనీ అర్హత సాధించటం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కేసు నమోదు:
ఎల్జీ పాలిమర్స్ మీద గోపాలపట్నం పోలీస్టేషన్ లో 278, 284, 285, 337, 338, 304 సెక్షన్ల కింద కేసు
నమోదు అయింది.
గ్యాస్ లీక్.. కారణం అదే!
విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదానికి ఎల్‌జీ పాలిమర్స్ యాజమాన్య నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. లాక్‌డౌన్‌లోనూ పరిశ్రమలో ప్రతిరోజు మెయింటెనెన్స్ చేయాల్సి ఉన్నప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. లాక్‌డౌన్ ఉన్నకారణంగా మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం 45 మందికి మెయింటెనెన్స్ పాస్‌లు ఇచ్చినప్పటికీ.. యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
పరిశ్రమ ట్యాంకుల్లో దాదాపు 2 వేల మెట్రిక్ టన్నుల స్టైరెన్‌ను నిల్వ చేసింది. అక్కడ 20 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత ఉంచడంలో ఫ్యాక్టరీ యాజమాన్యం విఫలమైంది.
విశాఖ ప్రమాదంలో…ప్రభుత్వ తప్పిదం ఉందా?
Related tags :