‘‘దక్షిణాది చిత్రసీమలో లేదా ఉత్తరాదిన హిందీ చిత్ర పరిశ్రమలో మాత్రమే క్యాస్టింగ్ కౌచ్ (సినిమాల్లో అవకాశాల పేరుతో వల విసిరి, లైంగిక కోరికలు తీర్చమనే ప్రక్రియ) ఉందనుకోవద్దు. ప్రపంచవ్యాప్తంగా దీని గురించి మాట్లాడారు. అన్ని రంగాల్లోనూ కౌచ్ సంస్కృతి ఉంది’’ అని అదా శర్మ అన్నారు. ‘హార్ట్ ఎటాక్’ చిత్రంతో తెలుగు తెరకు ఆమె కథానాయికగా పరిచయమయ్యారు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘క్షణం’, ‘కల్కి’ చిత్రాలు సహా హిందీ, కన్నడ, తమిళ భాషల్లో నటించారు. తాజాగా క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ‘‘నా దృష్టిలో ప్రతి ఒక్కరికీ ఎల్లప్పుడూ ఓ ఛాయిస్ ఉంటుంది… కౌచ్‌లో కూర్చోవాలా?, పడుకోవాలా? నిలబడాలా? లేదంటే అసలు ఏమీ చేయకూడదా? అని! నేల మీద కూడా కూర్చోవచ్చు కదా!’’ అన్నారు. ప్రస్తుతం హిందీలో ‘మేన్ టు మేన్’ చిత్రం చేస్తున్నారామె.
పొడుకోవచ్చు…కూర్చోవచ్చు…నిలబడవచ్చు
Related tags :