Politics

నాకు కరోనా లేదు-నేను బానే ఉన్నా

Amith Shah Press Release Claiming He Is Doing Fine

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ సోషల్‌ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన బోన్‌ క్యాన్సర్‌ బారినపడటంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున పుకార్లు కూడా వచ్చాయి. అందుకే కరోనా సమయంలోనూ పెద్దగా మీడియా సమావేశాల్లోకి రావడంలేదంటూ నెట్టింట్లో చర్చ జరుగుతోంది. అయితే తనపై వస్తున్న పుకార్లపై అమిత్‌ షా ట్విటర్‌ వేదికగా స్పందించారు. తాను ఎలాంటి వ్యాధితో బాధపడటంలేదని, పూర్తిగా అరోగ్యంగా ఉన్నానంటూ బదులిచ్చారు. సోషల్‌ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను అమిత్‌ షా ఖండించారు.