Health

రేపటి నుండి గాంధీలో ప్లాస్మా థెరపీ

Gandhi Hospital To Conduct Plasma Therapy From Tomorrow

తెలంగాణలో సోమవారం నుంచి ప్లాస్మా థెరపీ చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కరోనా నుంచి కోలుకున్న వారిలో 15 మంది ప్లాస్మా దానం చేసేందుకు ఇప్పటికే ముందుకు వచ్చారు. ఈ 15 మంది కూడా మొదట్లో కరోనా సోకిన 15 మంది విదేశీయులు కావడం గమనార్హం. ప్లాస్మా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కరోనా నుంచి కోలుకున్న 200 మంది గతంలోనే గాంధీ వైద్యులకు సంసిద్ధత తెలిపారు. 15 మంది నుంచి సోమవారం వైద్యులు రక్తం సేకరించనున్నారు. ఒక్కొక్కరి నుంచి 400 ఎం.ఎల్‌ రక్తం సేకరిస్తారు. ఒక్కొక్కరి రక్తం నుంచి ప్లాస్మా వేరు చేసేందుకు దాదాపు రెండు గంటల సమయం పట్టే వకాశముంది. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం ప్లాస్మాథెరపీ తీసుకునేందుకు అర్హులైన కరోనా రోగులు సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో ఐదుగురు మాత్రమే ఉన్నారు. ప్లాస్మా సేకరించిన తరువాత గ్రహీత రక్తం మ్యాచ్ చేయడంతో ఓటు క్రాస్ మ్యాచ్ చేసిన తరువాతనే రోగికి ప్లాస్మా ఇవ్వనున్నట్టు వైద్యులు వెల్లడించారు.