* రాష్ట్రాల్లోని అన్ని ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఆదేశించారు. ఈ మేరకు కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై వివిధ రాష్ట్రాల సీఎస్‌లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో మల్లికార్జున, వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డా. అరుణ కుమారి, ఇతర ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
* దేశంలో కరోనా విలయం ఏ మాత్రం తగ్గడం లేదు. కేంద్రం లాక్‌డౌన్ పొడిగించినా, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కరోనా పాజిటివ్‌ల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 3277 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 128 మంది కరోనా బారిన పడి ప్రాణాలు వదిలారు. ఈ మేరకు కేంద్రం ఆదివారం ఉదయం కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు దేశంలో 62939 మందికి కరోనా సోకగా.. 2109 మంది మరణించారు. 19,359 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 41472 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
* ఏపీ రాష్ట్రంలో కొత్తగా 50 క రో నా కేసులు 1980 కు పెరిగిన మొత్తం కేసులు. 2000కు చేరువలో ఏపీ.
* మహారాష్ట్రలో కరోనా రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు 786 మంది పోలీసులకు కరోనా సోకిందని మహారాష్ట్ర పోలీసుశాఖ తెలిపింది. వీరిలో 76 మంది కోలుకోగా, ఏడుగురు మృతి చెందారు. మహారాష్ట్ర పోలీసులు ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మార్చి 22 నుంచి 200 మంది పోలీసులపై దాడి కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 732 మంది నిందితులను అరెస్టు చేశారు. అలాగే లాక్‌డౌన్ నియమాలు ఉల్లంఘించినందుకు 660 మందిని అరెస్టు చేశారు. అదేవిధంగా 55,650 వాహనాలను స్వాధీనం చేసుకుని, వారికి రూ. 3,82,27,794 జరిమానా విధించారు. మార్చి 22 నుంచి ఇప్పటివరకూ 80 మంది పోలీసులు వివిధ దాడుల్లో గాయపడ్డారు. అలాగే 32 మంది ఆరోగ్య కార్యకర్తలపై దాడులు జరిగాయి.
* ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలు వైరస్‌తో విలవిల్లాడుతున్నాయి. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 41 లక్షలు దాటాయి. 14 లక్షల మందికిపైగా కరోనా వ్యాధిబారి నుంచి కోలుకున్నారు. అమెరికా, ఫ్రాన్స్, బ్రెజిల్ దేశాల్లో వైరస్ వ్యాప్తి అంతకంతకు పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆదివారం గత 24 గంటల్లో మొత్తం 41,01,796 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2,80,443 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి 14,41,791 మంది కోలుకున్నారు.
* అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ మంగళవారం జరగనున్నట్లు సమాచారం. లాక్‌డౌన్ నిబంధనలను వచ్చే దశలో ఏవిధంగా సడలించాలన్న దానిపై మోదీ సీఎంలతో చర్చించనున్నారు. కంటేయిన్‌మెంట్ జోన్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇటు దేశంలో, అటు రాష్ట్రాల్లో ఆర్థిక కార్యాలపాలు పుంజుకోవడంపైనే ప్రధానంగా చర్చించనున్నారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
* లాక్‌డౌన్ 3.0 ముగింపు గడువు దగ్గరపడుతున్న వేళ ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమంత్రులతో మరోసారి మాట్లాడనున్నారు. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారని ప్రధాని మంత్రి కార్యాలయం (పీఎంవో) వెల్లడించింది. రేపటి సమావేశంలో కేంద్ర హోం, ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రులు కూడా పాల్గొననున్నట్లు సమాచారం. గత సమావేశంలో కేవలం ప్రధాని, హోంమంత్రి మాత్రమే పాల్గొన్నారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది ఐదోసారి.
* రాష్ట్రంలో కరోనా – లాక్‌డౌన్ పరిస్థితులపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో అధికారులతో సమావేశమయ్యారు. అనుమతి ఉన్న ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి 7 వరకు దుకాణాలు తెరవాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. కేంద్రం మార్గదర్శకాల మేరకు దుకాణాలు తెరిచేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.