Business

మంగళవారం నుండి రైళ్లు నడుస్తాయి

Indian Railyway To Run 30 Trains With Online Booking Only

ఈ నెల 12 నుండి ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించే యోచనలో రైల్వే శాఖ.

మొదటగా 15 జనత రైళ్ల కార్యకలాపాలు ప్రారంభించాలని ఆలోచన.

న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి దిబ్రుగర్, అగర్తాలా, హౌరా, పాట్నా, బిలాస్‌పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మద్గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూ తవిలను కలిపే ప్రత్యేక రైళ్లుగా నడుస్తాయి.

ఆ తరువాత కోవిడ్ -19 సంరక్షణ కేంద్రాల కోసం 20,000 బోగీలను రిజర్వ్ చేసిన అనంతరం అందుబాటులో ఉన్న కోచ్‌ల ఆధారంగా కొత్త మార్గాల్లో మరిన్ని ప్రత్యేక సేవలను ప్రారంభించనున్న రైల్వే శాఖ.

వలస కార్మికుల తరలింపు కోసం ప్రతిరోజూ 300 రైళ్ల వరకు శ్రామిక్ స్పెషల్ గా పనిచేయడానికి వీలుగా తగిన సంఖ్యలో కోచ్‌లు రిజర్వు.

ఈ రైళ్లలో మే 11 వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న బుకింగ్ సదుపాయాలు.

కేవలం ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌లో మాత్రమే అందుబాటులో బుకింగ్స్.

రైల్వే స్టేషన్లలో టికెట్ బుకింగ్ కౌంటర్లు మూసివేత, ప్లాట్ ఫామ్ టికెట్లతో సహా ఎలాంటి కౌంటర్ టిక్కెట్లు జారీ చేయబడవు.

ధృవీకరించబడిన టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులను మాత్రమే రైల్వే స్టేషన్లలోకి అనుమతి.

ప్రయాణీకులు ఫేస్ కవర్ ధరించడం, ప్రయాణానికి ముందు స్క్రీనింగ్ తప్పనిసరి.

కరోనా లక్షణాలు లేని ప్రయాణీకులను మాత్రమే రైలు ప్రయాణానికి అనుమతి.