DailyDose

రేపే మోడీ-ముఖ్యమంత్రుల మీటింగ్-తాజావార్తలు

Modi To Tele Conference With Chief Ministers On LockDown

* లాక్‌డౌన్‌ 3.0 ముగింపు గడువు దగ్గరపడుతున్న వేళ ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమంత్రులతో మరోసారి మాట్లాడనున్నారు. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారని ప్రధాని మంత్రి కార్యాలయం (పీఎంవో) వెల్లడించింది. రేపటి సమావేశంలో కేంద్ర హోం, ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రులు కూడా పాల్గొననున్నట్లు సమాచారం. గత సమావేశంలో కేవలం ప్రధాని, హోంమంత్రి మాత్రమే పాల్గొన్నారు. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించడం ఇది ఐదోసారి.

* ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకుంటూ కరోనా నివారణ చర్యలను గవర్నర్‌ కిరణ్‌ బేదీ అడ్డుకుంటున్నారని ప్రధానమంత్రి మోదీకి.. పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి ఫిర్యాదు చేశారు. పుదుచ్చేరిలో శనివారం సీఎం విలేకరులతో మాట్లాడుతూ… గవర్నర్‌ కిరణ్‌ బేదీ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని, రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె కేంద్రప్రభుత్వానికి పలు లేఖలు రాశారని తెలిపారు.

* ఏపీలో ఐఏఎస్‌లు బదిలీలు

కొత్త నియామకాలు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు

కొత్తగా జిల్లాల్లో ఏర్పాటు చేసిన జేసీ-రెవెన్యూ, జేసీ-సంక్షేమం..
జే,సీ-అభివృద్ధి పోస్టులకు ఐఏఎస్‌ల నియామకం…

శ్రీకాకుళం జేసీ ( రైతు భరోసా, రెవెన్యూ)గా సుమిత్‌ కుమార్‌
శ్రీకాకుళం జేసీ(అభివృద్ధి)గా కె. శ్రీనివాసులు

విజయనగరం జేసీ( రైతు భరోసా, రెవెన్యూ)గా క్రైస్ట్‌ కిషోర్‌ కుమార్‌
విజయనగరం జేసీ(అభివృద్ధి)గా మహేశ్‌ కుమార్‌

విశాఖ జేసీ( రైతు భరోసా,రెవెన్యూ)గా వేణుగోపాల్‌రెడ్డి
విశాఖ జేసీ (అభివృద్ధి)గా పి. అరుణ్‌బాబు

తూర్పు గోదావరి జేసీ (రైతు భరోసా, రెవెన్యూ)గా లక్ష్మీషా
తూ.గో జేసీ (అభివృద్ధి)గా కీర్తి

పశ్చిమ గోదావరి జేసీ ( రైతు భరోసా, రెవెన్యూ)గా వెంకటరామిరెడ్డి
పశ్చిమ గోదావరి జేసీ (అభివృద్ధి) హిమాన్షు శుక్లా

కృష్ణా జేసీ ( రైతు భరోసా, రెవెన్యూ)గా మాదవి లతా
కృష్ణా జేసీ(అభివృద్ధి)గా శంకర్‌ లతోటి

గుంటూరు జేసీ ( రైతు భరోసా, రెవెన్యూ)గా దినేశ్‌ కుమార్‌
గుంటూరు జేసీ (అభివృద్ధి)గా ప్రశాంతి

ప్రకాశం జేసీ ( రైతు భరోసా, రెవెన్యూ)గా వెంకట మురళి
ప్రకాశం జేసీ (అభివృద్ధి)గా చేతన్‌

నెల్లూరు జేసీ ( రైతు భరోసా, రెవెన్యూ)గా వి.వినోద్‌ కుమార్‌
నెల్లూరు జేసీ (అభివృద్ధి)గా ఎన్‌ ప్రభాకర్‌రెడ్డి

చిత్తూరు జేసీ ( రైతు భరోసా, రెవెన్యూ)గా మార్కండేయులు
చిత్తూరు జేసీ (అభివృద్ధి)గా వి.వీరబ్రహ్మయ్య

కడప జేసీ ( రైతు భరోసా, రెవెన్యూ)గా ఎం.గౌతమి
కడప జేసీ (అభివృద్ధి)గా సాయికాంత్‌ వర్మ

అనంతపురం జేసీ ( రైతు భరోసా, రెవెన్యూ)గా నిశాంత్‌కుమార్‌
అనంతపురం జేసీ (అభివృద్ధి)గా లావణ్యవేణి

కర్నూలు జేసీ ( రైతు భరోసా, రెవెన్యూ)గా రవిసుభాష్‌
కర్నూలు జేసీ (అభివృద్ధి) ఎస్‌.రామసుందర్‌రెడ్డి

13 జిల్లాల్లో నాన్‌క్యాడర్‌ జేసీలందరూ జేసీ సంక్షేమం బాధ్యతలు

దిల్లీ రావును సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేసిన ప్రభుత్వం

* ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకుంటూ కరోనా నివారణ చర్యలను గవర్నర్‌ కిరణ్‌ బేదీ అడ్డుకుంటున్నారని ప్రధానమంత్రి మోదీకి.. పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి ఫిర్యాదు చేశారు. పుదుచ్చేరిలో శనివారం సీఎం విలేకరులతో మాట్లాడుతూ… గవర్నర్‌ కిరణ్‌ బేదీ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని, రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె కేంద్రప్రభుత్వానికి పలు లేఖలు రాశారని తెలిపారు.

* కుప్పం మండలం తంబిగానిపల్లి వద్ద వెల్డింగ్ షాపులో దారుణం చోటుచోసుకుంది..రాల్లను ఎత్తే క్రేన్ కు వెల్డింగ్ చేస్తున్న సమయంలో క్రేన్లోని ఆయిల్ ట్యాంకర్ పేలి ఇద్దరు సజీవ దహనం అయ్యారు..వివరల్లోకెళితే. కుప్పం మండలం రాగిమాను మిట్టకు చెందిన అప్సర్,ఎజాస్ ఇద్దరు గత కొంతకాలంగా ఒక వెల్డింగ్ షాపులో పనిచేసుకుంటున్నారు..ఈ క్రమంలో ఈరోజు ఉదయం క్వారీలో పనిచేసే ఎస్కార్ట్ లో సమస్య రావడంతో వెల్డింగ్ షాపులో ట్యాంకర్ కింద వెల్డింగ్ చేసేందుకు దిగారు. ఈ క్రమంలో అనుకోకుండా అందులోఉన్న సిలిండర్ తెరుచుకొని భారీ శబ్దం తో పేలడంతో అక్కడ పనిచేస్తున్న ఇద్దరు యువకులు ప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా చిన్నాబిన్నమయ్యాయి.క్షత గాత్రులను కుప్పం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

* దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కకున్న వలస కార్మికులను తరలించేందుకు ఉద్దేశించిన శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లకు అనుమతివ్వాలని రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్ని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. రాబోయే మూడు నాలుగు రోజుల్లో వలస కూలీలందరినీ తరలించేందుకు అవసరమయ్యే రైళ్లను రైల్వేశాఖ నడపనుందని చెప్పారు. ప్రత్యేక రైళ్లు నడిపేందుకు అనుమతివ్వాలంటూ పశ్చిమబెంగాల్‌ను కేంద్ర హోంమంత్రి కోరిన నేపథ్యంలో పీయూష్‌ గోయల్‌ రాష్ట్రాలను కోరడం గమనార్హం.

* దేశ రాజధాని దిల్లీలో ఆదివారం మరోసారి భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 3.4గా నమోదయినట్లు జాతీయ భూకంప అధ్యయన విభాగం (ఎన్‌సీఎస్‌) తెలిపింది. నెల రోజుల వ్యవధిలో దిల్లీలో భూమి కంపించడం ఇది మూడోసారి. భూకంపం కేంద్రం ఈశాన్య దిల్లీలోని వాజిర్‌పూర్‌లో ప్రాంతంలో ఉన్నట్లు ఎన్‌సీఎస్‌ అధిపతి జే.ఎల్. గౌతమ్‌ తెలిపారు. దాదాపు ఐదు కిలోమీర్లు లోతు వరకు భూమి కంపించిందని వెల్లడించారు. గత నెల 12, 13 తేదిల్లో కూడా వాజిర్‌పూర్ పరిసర ప్రాంతాలు కేంద్రంగా 3.5, 2.7 తీవ్రతతో రెండు సార్లు భూమి కంపించిందని ఎన్‌సీఎస్‌ తెలిపింది. భూకంపం రావడానికి అవకాశం ఉన్న ఐదు జోన్లలో దిల్లీ నాలుగో జోన్‌లో ఉంది.

* మనుషులను కరోనా వైరస్‌ పట్టి పీడిస్తోంటే, ఆఫ్రికన్‌ స్వైన్ ఫీవర్‌ అసోంలోని పందుల పాలిట యమపాశమవుతోంది. గత కొద్దిరోజులుగా అసోంలోని వివిధ ప్రాంతాల్లో విజృంభిస్తున్న స్వైన్‌ ఫీవర్ కారణంగా 13వేల పందులు మృత్యువాత పడినట్లు అక్కడి పశు సంవర్థకశాఖ అధికార వర్గాలు తెలిపాయి. అసోంలోని తొమ్మిది జిల్లాల్లో స్వైన్‌ ఫీవర్‌ విస్తృతంగా వ్యాపించడంతో ఇప్పటివరకూ 13,013 పందులు చనిపోయాయట. ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలి ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ కేసు నమోదైంది.

* అత్యవసర సమయంలో సేవలందిస్తోన్న వారికి కరోనా వైరస్‌ సోకడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఐదుగురు ఎయిర్‌ ఇండియా పైలట్లకు కొవిడ్‌-19 నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. వీరందరూ చైనాకు కార్గో విమానాలు నడిపిన వారేనని అధికారులు గుర్తించారు. అయితే వీరిలో ఎవ్వరికీ కరోనా లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం. అత్యవసర సేవల్లో భాగంగా వైద్య సామగ్రి తరలింపు కోసం ఎయిర్‌ ఇండియా కార్గో విమానాలు నడుపుతోంది.