నాట్స్ ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని న్యూ బ్రాన్స్‌విక్‌లో నిరాశ్రయులకు ఉచితంగా నిత్యావసరాలు, ఆహారం పంపిణీ చేశారు. నాట్స్ న్యూజెర్సీ టీం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. న్యూజెర్సీ నాట్స్ ప్రతినిధులు రమేశ్ నూతలపాటి, రాజ్ అల్లాడ, వంశీ వెనిగళ్ల, చంద్రశేఖర్ కొణిదెల, సూర్య గుత్తికొండ, శేషగిరి కంభంమెట్టు, కుమార్ వెనిగళ్ల తదితరులు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాట్స్ మాజీ అధ్యక్షడు, బోర్డ్ డైరెక్టర్ మోహన కృష్ణ మన్నవ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.
న్యూజెర్సీలో నాట్స్ అన్నదానం
Related tags :