సిలికానాంధ్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనబడిలో ఈ లాక్‌డౌన్ సమయంలో విద్యార్థులకు పరీక్షలను నిర్వహించారు. దీనితో పాటు మౌఖిక పరీక్షలు కూడా నిర్వహించారు. హైదరాబాద్ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ సహకారంతో అమెరికావ్యాప్తంగా దాదాపు 2700 మంది ఈ పరీక్షల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారని మనబడి కులపతి చమర్తి రాజు తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నిర్వహించి పరీక్షలను దిగ్విజయంగా నిర్వహించినందుకు, ఇందుకు సహకరించిన మనబడి ఉపాధ్యాయులు, వాలంటీర్లకు సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్, నిర్వాహకులు దీనబాబు కొండుభట్ల, దిలీప్ కొండిపర్తి, శాంతి కూచిభొట్ల తదితరులు ధన్యవాదాలు తెలిపారు.
సిలికానాంధ్ర మరో రికార్డు
Related tags :